ఎందుకు సిగ్గుపడాలి అంటున్న స్టార్ హీరోయిన్!
అయితే తాను అలా గ్లామర్ ని ఒలికించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని శ్రుతిహాసన్ పేర్కొంది.
By: Tupaki Desk | 29 July 2024 1:33 PM GMTగ్లామర్ రంగంలో పట్టు విడుపు ఉండాలి. అందాల ఆరబోతకు సిద్ధంగా లేనిదే ఈ రంగంలో రాణించడం సులువు కాదు. నటన అనేది ఎలివేషన్ కి సంబంధించినది. సాంప్రదాయ బద్ధంగా తెరపై కనిపిస్తే ఆ ఒక్క జానర్ కే ఈ బ్యూటీ సరిపోతుందని దూరం పెట్టేవాళ్లుంటారు. అలాంటి సమస్యలు ఎదుర్కొన్న చాలామంది కథానాయికలు ఇమేజ్ సమస్యతో తెరకు దూరమైపోయిన సంఘటనలు ఉన్నాయి. కానీ శ్రుతిహాసన్ లాంటి తెలివైన బ్యూటీ ఇలాంటి సమస్యను ఎలా అధిగమించిందో తెలిసినదే. అనగనగా ఒక ధీరుడు సమయంలో కనిపించిన శ్రుతిహాసన్ కి దరువు సినిమాలో కనిపించిన శ్రుతిహాసన్ కి మధ్య వైరుధ్యం ఎలాంటిదో గమనించదగినదే. అయితే తాను అలా గ్లామర్ ని ఒలికించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని శ్రుతిహాసన్ పేర్కొంది.
కెరీర్ ప్రారంభ దశలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి శ్రుతి నిర్మొహమాటంగా వెల్లడించింది. ఇటీవలి ఇంటర్వ్యూలో ఈ సీనియర్ నటి తన అనుభవాలను నిజాయితీగా షేర్ చేసింది. ఠఫ్ టైమ్ ఎలా ఉంటుందో కూడా అనుభవ పూర్వకంగా వెల్లడించింది. తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. శృతి తన కెరీర్ ప్రారంభ చిత్రాలలో ఒకదానిపై ప్రతికూల సమీక్షలు తీవ్రంగా ప్రభావితం చేసాయనివెల్లడించింది. విమర్శ చాలా తీవ్రంగా ఉంది. ఇది చాలా మంది ఔత్సాహిక తారల డ్రీమ్స్‌ని కొనసాగించకుండా ఆపేయగలవు.
అయినప్పటికీ శ్రుతి తన అనుభవాల నుండి పట్టుదలతో నేర్చుకునేందుకు ప్రయత్నించింది. కమర్షియల్ సినిమాల్లో నటించేందుకు తనకు ఎలాంటి సంకోచం లేదని, తన కెరీర్ ఎదుగుదలలో అవి కీలక పాత్ర పోషించాయని శ్రుతి అభిప్రాయపడింది. దానికోసం సిగ్గు పడాల్సినదేమీ లేదని కూడా ఖరాఖండిగా చెప్పింది.
ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి ప్రస్థావిస్తూ, అది అన్ని పరిశ్రమల్లో ఉందని అంగీకరించింది. అయితే తన తల్లిదండ్రులు కమల్ హాసన్ - సారిక తన కెరీర్ కోసం ఎటువంటి ప్రత్యేక సహాయం అందించలేదని వెల్లడించింది. సవాలక్ష సార్లు తన తండ్రి మార్గనిర్దేశం కోరిన సందర్భాలున్నాయని శ్రుతి తెలిపింది. అయితే చివరికి విజయం సాధించాలనే తన స్వంత దృఢ నిశ్చయమే తనను ముందుకు నడిపించిందని తెలిపింది. తనపై తాను ఆధారపడ్డానని స్పష్ఠంగా పేర్కొంది శ్రుతి.
దక్షిణాదితో పాటు ఉత్తరాదినా తనదైన అద్భుత ఫాలోయింగ్ సంపాదించిన శ్రుతిహాసన్ కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉందిప్పుడు. డెకాయిట్, కూలీ, సలార్ 2, చెన్నై స్టోరీ సహా పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. రెండుసార్లు రియల్ లైఫ్ ప్రేమలో విఫలమైనా కానీ, శ్రుతి కెరీర్ విషయంలో ఎంతమాత్రం నిస్సత్తువను ప్రదర్శించలేదు.