బ్రేకప్ విషయంలో శ్రుతి హాసన్ మౌనం వీడిందా!
శ్రుతిహసన్-శంతను హజారికా మధ్య దూరం పెరగిందంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 May 2024 3:55 AM GMTశ్రుతిహసన్-శంతను హజారికా మధ్య దూరం పెరగిందంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇరువురి ఇన్ స్టాలో అన్ ఫాలోచేసుకోవడం..శ్రుతి ఖాతాలో ప్రియుడి జ్ఞాపకాల్ని డిలీట్ చేయడం వంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు విడిపోయినట్లు అధికారికంగా ఎక్కడా వార్తలు రాలేదు గానీ! అలాగే వాటి గురించి శ్రుతి గానీ..శంతన్ గానీ స్పందించింది కూడా లేదు. అయితే ఇద్దరు విడిపోయింది వాస్తవమే అన్నట్లు గా శంతను కొన్ని సంకేతాలు పాస్ చేసాడు.
ఇద్దరు విడిపోయారు అంట కదాని? ప్రశ్నించగా దాన్ని ఖండించలేదు. `నన్ను క్షమించండి. ఆ విషయం మాట్లాడను` అనేసాడు. దీంతో మౌనం అర్దాంగీకారం అన్నట్లు కనిపించింది. ఖండించని నేపథ్యంలో ఇద్దరు విడిపోయినట్లే కనిపిస్తుందని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఓ అండర్ స్టాండింగ్ ప్రకారమే దూరమైనట్లు ప్రచారమైంది. ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకోవడం గానీ.. ఇన్ స్టాలో పోస్టు లు గానీ ఎవీ కనిపించలేదు. ఎంత కూల్ గా కలిసారో..అంతే కూల్ గా దూరమైనట్లు ముంబై మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి.
అయితే దీని గురించి శృతి హాసన్ ఇప్పటివరకూ ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. సోషల్ మీడియాలో కూడా ఎలాంటి లీక్ లు ఇవ్వలేదు. అలా కొన్నాళ్ల పాటు మౌనం వహించింది. అయితే ఇప్పుడా మౌనాన్ని అనూహ్యంగా వీడినట్లు కనిపిస్తుంది. శంతను కంటే వృత్తిగత జీవితమే ముఖ్యమని అమ్మడు కొన్ని సంకేతాలు పంపినట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది. వ్యక్తిగత జీవితం...వృత్తి గత జీవితమే తనకు అత్యంత ముఖ్యమని ఇంకెలాంటి విషయాలు తనకు సంబంధం లేనట్లు స్పందించినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో శృతి హాసన్ కొత్త సినిమాల జోరు కూడా పెంచుతుందని అంటున్నారు. అమ్మడు మొదటి ప్రియుడు మైఖెల్ కోర్సలేతో ఎంత వరకూ వెళ్లిందో తెలిసిందే. వ్యక్తి..వృత్తిగత జీవితాన్ని సైతం లెక్క చేయకుండా అతగాడితో ప్రేమలో మునిగి తేలింది. ఆ తర్వాత విడిపోవడంతో మనసుకు తగిలిన గాయం నుంచి కోలుకోవడానికి కొంత సమయం తీసుకుంది. కానీ శంతన్ హజారికా విషయంలో తొలి నుంచి బ్యాలెన్స్ గానే కనిపించింది. బ్రేకప్ తర్వాత అవనరసంగా సమయాన్ని వృద్ధా చేయకుండా కెరీర్ పై దృష్టి పెట్టి పనిచేస్తోంది.