Begin typing your search above and press return to search.

ఇకపై అలా అంటే జోక్‌ గా తీసుకోం : శృతిహాసన్‌

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శృతి హాసన్‌.

By:  Tupaki Desk   |   21 Jun 2024 10:22 AM GMT
ఇకపై అలా అంటే జోక్‌ గా తీసుకోం : శృతిహాసన్‌
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శృతి హాసన్‌. కెరీర్‌ ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ముద్దుగుమ్మ శృతి హాసన్‌ సొంత ఇమేజ్ తో సక్సెస్‌ లను సొంతం చేసుకుని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

ప్రస్తుత జనరేషన్ హీరోయిన్స్ లో మల్టీ టాలెంటెడ్‌ హీరోయిన్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉంటుంది శృతి హాసన్‌. సింగర్‌ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా ఇలా ఎన్నో విధాలుగా శృతి హాసన్‌ వర్క్ చేసిన విషయం తెల్సిందే.

ఇటీవల ఒక మ్యూజిక్ ఆల్బమ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. సలార్ 2 షూటింగ్ కి రెడీ అవుతున్న శృతి హాసన్ ఒక భారీ యాక్షన్ వెబ్ సిరీస్ లో నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా శృతి హాసన్‌ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది.

తాజాగా అభిమానులతో చిట్‌ చాట్‌ సందర్భంగా శృతి హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక అభిమాని సౌత్ ఇండియన్‌ యాస లో ఏదైనా చెప్పండి అంటూ విజ్ఞప్తి చేయగా... ఈ రకమైన జాతి వివక్షను నేను అసలు సహించను. మమ్ములను ఇడ్లీ, సాంబర్‌, దోస అంటూ పిలస్తే ఊరుకునేది లేదు. మీరు మమ్ములను ఎప్పటికి అనుకరించలేరు.

మమ్ములను అనుకరించడం మీకు సాధ్యం కాదు కనుక మాలాగా మీరు ఉండాలని ట్రై చేయకండి. ఎలా పడితే అలా పిలిస్తే జోక్ గా తీసుకోము, లైట్‌ అసలే తీసుకోము. సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమన్నావు కదా... నోరు మూసుకొని వెళ్లు అంటూ తమిళ లిపిలో శృతి రాసుకొచ్చింది.

ఇటీవల ఉత్తరాది వారు ముఖ్యంగా బాలీవుడ్‌ వారు సౌత్‌ స్టార్స్ ను ఇడ్లీ, సాంబార్‌, దోస అంటూ పిలుస్తున్న నేపథ్యంలో శృతి హాసన్‌ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన కౌంటర్‌ కి అంతా ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా సౌత్‌ ఇండియన్‌ ఫ్యాన్స్ ఆమె ఘట్స్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.