శంతను హజారికాతో శ్రుతి బ్రేకప్?
ప్రేమ ఎంత మధురం.. కాలం అంత కఠినం! మారిన సామాజిక పర్యవసానం లవ్ బ్రేకప్ వార్తలకు ఆజ్యం పోస్తోంది.
By: Tupaki Desk | 26 April 2024 6:56 AM GMTప్రేమ ఎంత మధురం.. కాలం అంత కఠినం! మారిన సామాజిక పర్యవసానం లవ్ బ్రేకప్ వార్తలకు ఆజ్యం పోస్తోంది. ఇంతకుముందు విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయి కొన్నేళ్ల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిన శ్రుతిహాసన్ డూడుల్ ఆర్టిస్టు శంతను హజారికాతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అతడితో ముంబైలో లివిన్ రిలేషన్ షిప్ లో ఉండటం చాలా చర్చనీయాంశమైంది. శ్రుతి-శంతను జంట తమ లవ్‌లోని బోల్డ్ నెస్ ని ఏనాడూ దాచుకోలేదు. ఈ జంట అన్యోన్యతను చూసి ముచ్చటపడ్డారు అభిమానులు.
శంతను హజారికాతో హృతి హాసన్ కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది. అయితే తాజాగా వీరిద్దరు విడిపోయినట్లు సమాచారం. శ్రుతి తన సోషల్ మీడియా ఖాతా నుండి తాత్కాలికంగా అదృశ్యమవ్వడంతో సందేహాలు మొదలయ్యాయి. ఇటీవల సౌండ్ లేదు. ప్రియుడితో ఫోటోలు రిలీజ్ కాలేదు. దీంతో అభిమానుల్లో ఇది చర్చగా మారింది. శ్రుతి నిజానికి ఇన్ స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంది. తరచుగా అభిమానులతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇటీవల శంతనుతో శ్రుతి సందడి కనిపించలేదు.
శ్రుతి, శంతను కూడా నెల రోజుల నుంచి విడివిడిగా జీవిస్తున్నారని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ నుండి కొంత విరామం తీసుకున్న తర్వాత శ్రుతి తిరిగి ఒక క్రిప్టిక్ పోస్ట్ ని షేర్ చేసింది. ``ఇది నా గురించి.. వ్యక్తుల గురించి చాలా నేర్చుకున్నాను... ఇది ఒక క్రేజీ రైడ్`` అని రాసింది. దీంతో ఈ జంట విడిపోయారంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని పోస్టులతో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించినా కానీ, ఇన్ స్టా ఫీడ్‌లో శాంతనుతో ఉన్న ఫోటోలు కనిపించలేదు. వారిద్దరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది.
కొన్ని నెలల క్రితం ఓర్రీ (ఓర్హాన్ అవత్రమణి) శాంతనుని రెడ్డిట్‌లో శృతి భర్త అంటూ పేర్కొన్నాడు. దీంతో ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ పుకార్లను ఖండించడమే గాక ఓర్రీని నిందించింది. ``నేను పెళ్లి చేసుకోలేదు. ప్రతి విషయం గురించి బహిరంగంగా చెప్పే వ్యక్తి కోసం ఇది చెబుతున్నాను.. నేను పెళ్లి అయితే ఎందుకు దాచిపెడతాను? LOL కాబట్టి నాకు అస్సలు తెలియని వ్యక్తులు, దయచేసి శాంతించండి`` అని శ్రుతి చిర్రుబుర్రులాడింది.
శ్రుతి హాసన్ మరియు ఆమె ప్రేమికుడు శాంతాను హజారికా హఠాత్తుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అనుసరించడం మానేయడంతోనే అసలు విషయం బయటపడింది. శృతి -శాంతను ఇన్ స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం పుకార్లకు ఆజ్యం పోసింది. శృతి హాసన్ తన పేజీ నుండి శాంతను ఉన్న అనేక పోస్ట్‌లను తొలగించింది. కారణం ఏదైనా శ్రుతి బ్రేకప్ ఖరారైందని మీడియాలో కథనాలొస్తున్నాయి. హీరామండి ప్రీమియర్ లో శంతను లేకుండా శ్రుతి ఒంటరిగా కనిపించడం కూడా తాజా ప్రచారానికి ఆజ్యం పోసింది.