శ్రుతి హాసన్ రిస్క్ రేంజ్ పెంచుతుందా?
ఓవైపు సంగీతం..మరోవైపు నటనతోనూ సంతోషంగా గడుపుతోన్న రోజులివి.
By: Tupaki Desk | 7 Jun 2024 2:30 PM GMTకమల్ హాసన్ గారాల పట్టిగా తెరంగేట్రం చేసిన శ్రుతి హాసన్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు మల్టీట్యాలెంటెడ్. నటిగా మ్యాకప్ వేసుకోవడానికి ముందే మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. గాయనిగా, సంగీతంలోనూ మంచి పట్టు ఉంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ పనిచేసింది. నటిగా మ్యాకప్ వేసుకున్న తర్వాత వాటికి దూరమైంది. తాజాగా తన కెరీర జర్నీని ఉద్దేశించి అమ్మడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓవైపు సంగీతం..మరోవైపు నటనతోనూ సంతోషంగా గడుపుతోన్న రోజులివి.
ఈ దశ నాకెంతో ప్రత్యేకమైనది. గడిచిన రోజులు కం టే ఇప్పుడే ఎక్కువగా రిస్క్ పనులు చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే గతం కంటే రిస్క్ రేంజ్ పెంచాను అనుకుంటున్నాను. ఇప్పుడు మరింత రెట్టింపు ఉత్సాహంతో ఆలోచించగలుగుతున్నాను. అంతే వేగంగా పనిచేయగలుగుతున్నాను. దీన్ని బట్టే నేను తీసుకునే నిర్ణయాలు కూడా అంతే సాహసోపేతంగా మారుతున్నాయి. జీవితంలో రిస్క్ తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తీసుకోవాల్సిందే. లేదంటే కొన్ని విషయాల్లో వెనుకబడే ప్రమాదం ఉంటుంది` అని తెలిపింది.
అలాగే ఇటీవలే భారతీయుడు-2 ఈవెంట్ లో భాగంగా చెన్నైలో కమల్ హాసన్ ముందే సంగీత ప్రదర్శన ఇచ్చింది. ఆ సంతోషాన్ని పంచుకుంది. అందొక అందమైన అనుభవం. మా నాన్నని సంగీతంతో సత్కరించేందుకు ఆవేడుకకు ఆహ్వానించినందుకు గర్వంగా ఉంది. నా పాటల్ని ఎప్పుడూ మానాన్నతో పంచుకుంటా. కానీ అంతమంది జనాల సమక్షంలో పంచుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని` తెలిపింది.
ఇక శ్రుతి హాసన్ కెరీర్ జర్నీ ఎలా సాగుతుందో తెలిసిందే. అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతుంది. అన్ని భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే `సలార్` తో పాన్ ఇండియాలో భారీ విజయం అందుకుంది. `సలార్ -2` లోనూ అమ్మడి పాత్ర కీలకం కానుంది. ప్రస్తుతం కొన్ని సినిమా షూట్లలో బిజీగా ఉంది.