శ్రుతి హాసన్-శాంతన్ హజరికా పెళ్లి చేసుకోరా!
శ్రుతిహాసన్-శాంతన్ హజారికా మధ్య రిలేషన్ షిప్ గురించి తెలిసిందే. ఇద్దరు కొంత కాలంగా ప్రేమ లో మునిగి తేలుతున్నారు
By: Tupaki Desk | 16 Sep 2023 1:30 AM GMTశ్రుతిహాసన్-శాంతన్ హజారికా మధ్య రిలేషన్ షిప్ గురించి తెలిసిందే. ఇద్దరు కొంత కాలంగా ప్రేమ లో మునిగి తేలుతున్నారు. మైఖెల్ కోర్సలే తో రిలేషన్ షిప్ చెడిన తర్వాత శ్రుతి శాంతన్ కి దగ్గరైంది. ముందు స్నేహితులుగా మొదలై అటుపై పీకల్లోతు ప్రేమలో మునిగి తేలడం మొదలు పెట్టారు. ఎప్పటికప్పుడు తమ ప్రేమ బంధాన్ని ఇన్ స్టా వేదకిగా తెలియపరుస్తూనే ఉంటారు. వెకెషన్లు..ముంబై వీధుల్లో షికార్లు ఇలా ఇద్దరి మద్య చాలా కథే నడించింది.
మరి ఈ రిలేషన్ షిప్ పెళ్లి వరకూ వెళ్తుందా? మధ్యలోనే వీగిపోతుందా? అన్నది తర్వాత సంగతి. మరి ఇద్దరి మధ్య పరిచయం ఎలా జరిగింది? ముందుగా ఎవరు ప్రపోజ్ చేసారు? అన్న విషయాలు మాత్రం ఇంతవరకూ ఎక్కడా బయటకు రాలేదు. తాజాగా ఈ విషయాల్ని శ్రుతిహాసన్ ఇన్ స్టాచిట్ చాట్ లో రివీల్ చేసింది. శాంతను హజారికి డూడూల్ ఆర్టిస్ట్. అతని ఆర్ట్ వర్క్ నచ్చి ఇన్ స్టాలో అతన్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టాను.
ఆ తర్వాత నన్ను అతను యాక్సెప్ట్ చేసాడు. అలా ఇద్దరి మధ్య తొలిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహం మొదలైంది. అటుపై ప్రేమవరకూ దారి తీసింది. సింపుల్ గా చెప్పాలంటే ఇన్ స్టాలోనే ప్రేమ పుట్టింది అని తెలిపింది. మొత్తానికి శ్రుతిహాసన్ రెండవ ప్రేమ ఎలా పుట్టిందో ఓ క్లారిటీ దొరికింది. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని మరో నెటి జనుడు ప్రశ్నించగా ..అలాంటి బోరింగ్ ప్రశ్నలు వద్దు అనేసింది.
దీంతో శ్రుతి హాసన్ తన ప్రేమని పెళ్లి వరకూ తీసుకెళ్లదా? లేక జీవితంలో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోవడంతో అలా బధులిచ్చిందా? అన్నది మరో సందేహం. కారణాలు ఏవైనా శ్రుతి మాటల్ని బట్టి శాంతను తో రిలేషన్ షిప్ కూడా కొంత కాలమే అన్న ప్రచారం మొదలైంది. అలాగే అమ్మడు నటి కాకపోయి ఉంటే సేల్స్ గర్ల్ అయ్యేదిట. చిన్నప్పుడు అలాంటి ఆలోచనలు ఉండేవట. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ ఆలోచన విరమించుకుందిట.