సైమాకే వన్నె తెచ్చిన సెల్పీ ఇదే!
అంద గత్తెలంతా ఒకే చోట చేరితో ఆ చర్చ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 17 Sep 2023 10:37 AM GMTఅంద గత్తెలంతా ఒకే చోట చేరితో ఆ చర్చ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ బాగా తెలిసిన భామలంతా అంతా గేదర్ అయితే ముచ్చట్లకి సమయమే తెలియదు. దుబాయ్ సైమా అవార్డులు అందుకు మంచి వేదికైనట్లు కనిపిస్తోంది. రెండు రోజుల పాటు జరిగిన వేడుకలకు దక్షిణాది చలన చిత్ర పరిశ్రమ నటీనటులంతా హాజరైన సంగతి తెలిసిందే. హీరోయిన్లంతా ఒక వరుస క్రమంలో..హీరోలంతా ఒక వరుస క్రమంలో కూర్చుని వేడుకల్ని ఆస్వాదించారు.
ఇక అందమైన భామా మణులు రచ్చకైతే తిరుగులేదు. డిజైనర్ దుస్తుల్లో..ఆల్ట్రామోడ్రన్ దుస్తుల్లో తళుక్కున మెరిసారు. ఆ రెండు రోజులు అందాలన్ని దుబాయ్ లోనే కొలువు దీరాయి. తెలిసిన వాళ్లంతా ఒకర్ని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుని సంభాషించుకున్నారు. తెలియని వారంతా షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకున్నారు. కానీ ఈ ముగ్గురు భామలు మాత్రం సెల్పీలతో పిచ్చెక్కించారు.
అవును శ్రుతిహాసన్..కీర్తి సురేష..కళ్యాణి ప్రియదర్శి ఒకే వరుసలో కుర్చిని తొంగి తొంగి మరీ సెల్పీలు దిగారు. రెండవ రోజు వేడుకల్లో భాగంగా డిజైన్డ్ బ్లాక్ గౌనులో శ్రుతి తళతళలాడింది. అందమంతా తన సొంతమే అనిపించింది. అలాగే కీర్తి సురేష్ స్టైలిష్ బ్లూ ప్యాంట్‌సూట్‌లో బాస్ లేడీగా ముస్తాబైంది. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తోనూ ఆకట్టుకుంది. ఇక కళ్యాణి ప్రియదర్శి సిజ్లింగ్ రెడ్ డ్రెస్‌లో కాక పుట్టించింది. ఈ సెల్పీకి కారకు రాలు ఆమెనే.
శ్రుతిహాసన్..కీర్తిని నా వైపు ఒకసారి చూడంటి అంటూ అమ్మడు స్మార్ట్ ఫోన్ క్లిక్ మనిపించింది. చాలా కాలం తర్వాత కలవడంతో ఉన్నంతసేపు ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ముద్దుగుమ్మలు ముగ్గుర్ని సెల్పీలో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇక కెరీర్ పరంగా ముగ్గురు వివిధ భాషల్లో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.