‘శుభం’తో సమంత కొత్త ప్రయాణం!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేసింది. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ తన టాలెంట్‌ను అప్పుడప్పుడు పరీక్షించుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తోంది.
By: Tupaki Desk | 15 March 2025 7:19 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేసింది. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ తన టాలెంట్‌ను అప్పుడప్పుడు పరీక్షించుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తోంది. గతంలో యూ టర్న్ లాంటి సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి అమ్మడు ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే న్యూ బ్యానర్ తో ఆమె స్వంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై "‘శుభం’ వచ్చినా చూడాల్సిందే" అనే సినిమా తెరకెక్కింది.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక సమంత ప్రొడక్షన్ టీమ్‌తో కలిసి ‘శుభం’ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తయిన సందర్భంగా వారిని కలిశారు. సినిమా పోస్టర్‌లో పాతకాలం టీవీలలో కనిపించే క్యాస్టింగ్ స్టిల్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే, ఆమె పూజలో పాల్గొంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత సినిమా పై హైప్ పెరుగుతుండడం విశేషం.
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సమంత, తన తొలి నిర్మాణ చిత్రాన్ని కూడా అదే కోణంలో ఎంచుకుంది. ఈ సినిమాకు వసంత్ మారిగంటి కథ అందించగా, సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. కంటెంట్ బేస్డ్ కథలను ప్రోత్సహించే సమంత, మొదటి సినిమా నుంచే ఒక కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తోంది.
కామెడీ, థ్రిల్లర్ అంశాలతో వస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన సాంకేతిక విభాగాల్లో టెక్నీషియన్లు కూడా టాప్-నాచ్‌గా ఉన్నారు. మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రాఫర్‌గా, ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు.
రామ్ చరణ్ తేజ్ ప్రొడక్షన్ డిజైన్ చూసుకుంటున్నారు. ప్రొడక్షన్ టీమ్‌లో రాకేష్ గడ్డం, ఆర్యన్ దగ్గుపాటి కీలక బాధ్యతలు చేపట్టారు. అన్ని పనులు పూర్తిచేసుకుని సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత ఈ ప్రాజెక్ట్ పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ ద్వారా కొత్త కథలు, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నామని ఆమె అన్నారు. మరి రానున్న రోజుల్లో సమంత ఇంకెలాంటి సినిమాలను తెరపైకి తీసుకు వస్తారో చూడాలి.