స్టార్ హీరో ఫ్యామిలీ, సన్నిహితులు.. తస్మాత్ జాగ్రత్త
రోహిరా ప్రమాదం గురించి తెలిసో తెలియకో .. సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు.
By: Tupaki Desk | 1 Feb 2025 8:21 AM GMT``జీవితం ఎప్పుడూ సర్‌ప్రైజ్‌లతో నిండి ఉంటుంది.. ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తుందో తెలీదు`` అని అన్నారు నటి శ్వేతా రోహిరా. తనకు జరిగిన పెను ప్రమాదంలో చావు నుంచి బయటపడినా కానీ, తీవ్రంగా గాయాలపాలైన ఈ నటి, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సల్మాన్ ఖాన్ రాఖీ సోదరిగా పాపులరైన శ్వేతా రోహిరా ఇటీవల బైక్ ఢీకొని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ఘటనలో ఆమెకు పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి. బొమికలు విరిగాయి. శ్వేత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. తనకు తగిలిన దెబ్బల ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఆస్పత్రి బెడ్ పై ధీనంగా కనిపించింది రోహిరా. ఫోటోలలో గాయాలు కనిపిస్తున్నాయి. తన ముఖంపై కట్టు కూడా ఉంది. తాను ఎలా అయినా కోలుకుంటానని అభిమానులకు మాటిచ్చింది.
పరిస్థితులు, అనుభవాల నుంచి నేర్చుకుని మరింత ధృఢంగా బలంగా మారతానని కూడా రోహిరా ఈ సందర్భంగా అన్నారు. రోహిరా ప్రమాదం గురించి తెలిసో తెలియకో .. సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు. సల్మాన్ ప్రస్తుతం మురుగదాస్ తో సికందర్ సినిమా రిలీజ్ కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు. సినిమాని వేగంగా పూర్తి చేసి సకాలంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఓవైపు చిత్రీకరణలో ఉండగానే అతడు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపులను ఎదుర్కొన్నాడు. దీంతో టైట్ సెక్యూరిటీ నడుమ సల్మాన్ షూటింగులు పూర్తి చేస్తున్నాడు. భాయ్ కనిపించని ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఇంతకుముందు బిష్ణోయ్ గ్యాంగ్ తన అపార్ట్ మెంట్ పై కాల్పులు జరిపినప్పటి నుంచి ఆ కుటుంబం చాలా టెన్షన్ లో ఉంది. ఇప్పుడు తన వారికి కూడా ప్రమాదాలవ్వడం అతడికి షాకిస్తోంది. మరోవైపు సల్మాన్ చుట్టూ ఉన్నవారికి ఏదో ఒక రూపంలో ప్రమాదం తప్పదని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా అతడిలో చాలా భయాందోళనలకు తెరతీసింది.