Begin typing your search above and press return to search.

శ్వేతాబచ్చ‌న్ 'తోడేలు' కామెంట్ ఎవ‌రినుద్ధేశించి?

సినీ కుటుంబాల్లో ఏ చిన్న వివాదం బ‌య‌ట‌ప‌డినా దానిపై చాలా చ‌ర్చ జ‌రుగుతుంది. సామాన్యుల ఇళ్ల‌లో ఉన్న‌ట్టే అక్క‌డా కొన్ని గొడ‌వ‌లుంటాయి

By:  Tupaki Desk   |   6 Feb 2024 7:43 PM GMT
శ్వేతాబచ్చ‌న్ తోడేలు కామెంట్ ఎవ‌రినుద్ధేశించి?
X

సినీ కుటుంబాల్లో ఏ చిన్న వివాదం బ‌య‌ట‌ప‌డినా దానిపై చాలా చ‌ర్చ జ‌రుగుతుంది. సామాన్యుల ఇళ్ల‌లో ఉన్న‌ట్టే అక్క‌డా కొన్ని గొడ‌వ‌లుంటాయి. అంత‌ర్గ‌త వివాదాలుంటాయి. ఒక్కోసారి అవి ర‌చ్చ‌కెక్కుతుంటాయి. మీడియా వేటినీ దాచ‌దు. ఇటీవ‌ల హిందీ మీడియాలో బ‌చ్చ‌న్ ల కుటుంబంలోని లొల్లి గురించి ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. అత్త జ‌యాబ‌చ్చ‌న్ .. ఆడ‌ప‌డుచు శ్వేతాబ‌చ్చ‌న్ ల‌తో ఐశ్వ‌ర్యారాయ్ సంబంధాలు స‌రిగా లేవ‌ని దీంతో భ‌ర్త‌ను వారికి దూరం చేస్తోంద‌ని మీడియా కోడై కూసింది. భ‌ర్త‌తో ఐశ్వ‌ర్యారాయ్ వేరు కాపురం కోసం పోరుతోంది అంటూ కొన్నాళ్లుగా ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత శ్వేతాబ‌చ్చ‌న్- ఐష్ మ‌ధ్య‌ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది అని ప్ర‌చారమైంది. ఇటీవ‌ల అభిషేక్ కి ఐశ్వ‌ర్యారాయ్ విడాకులిచ్చేస్తోందంటూ బోలెడంత ప్ర‌చారం ఊద‌ర‌గొడుతోంది బాలీవుడ్ మీడియా.


అయితే ఇన్ని స‌న్నివేశాల న‌డుమ భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ ప‌లు ఈవెంట్ల‌లో క‌లిసి క‌నిపిస్తూ అన్ని రూమ‌ర్ల‌కు చెక్ పెడుతున్నారు. మొన్న‌టికి మొన్న ఒక స్కూల్ ఈవెంట్లో అభి-ఐష్ జంట త‌మ కుమార్తె ఆరాధ్య‌తో పాటు క‌లిసి క‌నిపించారు. ఇప్పుడు అభిషేక్ బ‌చ్చ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఐశ్వ‌ర్యారాయ్ ఒక అంద‌మైన కుటుంబ ఫోటోతో అన్ని రూమ‌ర్ల‌కు చెక్ పెట్టేసింది. అయినా కానీ ఇంకా ఆ కుటుంబంలో ఆర‌ని జ్వాల అంటూ హిందీ మీడియా ప్ర‌చారం సాగిస్తూనే ఉంది.

నిప్పు లేనిదే పొగ రాద‌ని అంటారు. ఇప్పుడు ఐశ్వ‌ర్యారాయ్ కి ఆడ‌ప‌డుచు.. అభిషేక్ బ‌చ్చ‌న్ అక్క అయిన శ్వేతా బచ్చన్ నందా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఒక క్రిప్టిక్ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఇందులో శ్వేతా బ‌చ్చ‌న్ అప్ర‌య‌త్నంగా 'తోడేలు' అంటూ ఎవరినో కామెంట్ చేసార‌ని అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. ఆ కామెంట్ ఎవ‌రిపై అంటే ఐశ్వ‌ర్యారాయ్ పైనే అంటూ నెటిజ‌నుల్లో డిబేట్ మొద‌లైంది.

అభిషేక్ బచ్చన్ పుట్టినరోజుపై శ్వేతా బ‌చ్చ‌న్ క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేసారు. శ్వేతా బచ్చన్ నందా సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆడ తోడేలు సంపూర్ణ బలం, పట్టుదల గురించి గుంబ‌న‌గా వ్యాఖ్యానించారు. ఆసక్తికరంగా శ్వేత పోస్ట్ చేసిన సమయం ఆమె తమ్ముడు, నటుడు అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు కావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 2024 ఫిబ్రవరి 5 నాటికి అభిషేక్‌కి 48 ఏళ్లు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిషేక్‌కి ఒక అంద‌మైన‌ త్రోబాక్ ఫోటోతో శుభాకాంక్షలు తెలిపిన వెంటనే శ్వేత నిగూఢమైన పోస్ట్‌ను షేర్ చేసింది. ''ఆడ తోడేలు తనను తాను మెరుగుపరుచుకోవాలనుకుని దేనినైనా మించిపోతుంది. తాను ప్రవేశించాల్సిన ప్రదేశానికి మ‌గ తోడేలును కూడా లాగుతుంది. బహుశా తోడేళ్ళ నుండి నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది.. లేదా మనలో కొంతమంది ఇప్పటికే అలాంటి ల‌క్ష‌ణాల‌ను కలిగి ఉండవచ్చు'' అని కామెంట్ చేసింది. ఇది క‌చ్ఛితంగా ఐశ్వ‌ర్యారాయ్ ని ఉద్ధేశించి శ్వేత చేసిన వ్యాఖ్య అంటూ నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగుతోంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా మ‌న‌స్ఫ‌ర్థ‌లు క్లియ‌ర్ కాలేద‌ని కూడా చాలా మంది భావిస్తున్నారు.

అభిషేక్ పుట్టినరోజును పుర‌స్క‌రించుకుని తామిద్ద‌రూ పిల్లలుగా ఉన్నప్ప‌టి పాత ఫోటోను శ్వేతా షేర్ చేసింది. ఫోటోలో ఇద్దరు పిల్లలు స్వీట్లు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో అభిషేక్ దూరంగా ఏదో చూస్తున్న‌ప్పుడు శ్వేత తన తమ్ముడి వైపు ప్రేమగా చూస్తోంది. శ్వేత ఈ ఫోటోకి గ‌మ్మ‌త్త‌యిన‌ క్యాప్షన్ ఇచ్చింది. ''అది కాదు - మీకు తెలుసు.. ఇది మీకు మాత్రమే తెలుసు.. ఇది మీ బిగ్ డే లిటిల్ బ్రదర్.. నాకు తెలుసు - మీరు లవ్ యు పాటను ఆస్వాధిస్తారని ఆశిస్తున్నాను'' అని రాసింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న‌ గులాబ్ జామూన్ (2024)లో అభిషేక్ ప్ర‌స్తుతం న‌టిస్తున్నారు. వ‌రుస సినిమాల‌తో అత‌డు బిజీగా ఉన్నాడు.