Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : కొత్త బంగారు లోకం బ్యూటీ కొత్త అందం

అయితే సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో కెరీర్‌ లో నిలదొక్కుకోవడంలో విఫలం అయ్యింది అనే టాక్‌ ఉంది.

By:  Tupaki Desk   |   6 July 2024 12:30 PM GMT
పిక్ టాక్ : కొత్త బంగారు లోకం బ్యూటీ కొత్త అందం
X

తెలుగు ప్రేక్షకులకు కొత్తబంగారు లోకం సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన శ్వేత బసు ప్రసాద్‌ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో కెరీర్‌ లో నిలదొక్కుకోవడంలో విఫలం అయ్యింది అనే టాక్‌ ఉంది.

టాలీవుడ్‌ లో ఆఫర్లు పెద్దగా రాని సమయంలో ఇతర భాషల సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడు ప్రయత్నాలు చేసి కొంతలో కొంత అయినా ఆఫర్లు దక్కించుకుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఈమె కంటిన్యూ కావడానికి ప్రధాన కారణం అందాల ఆరబోత అనేవారు ఉన్నారు.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా మరోసారి బికినీ స్థాయి ఔట్‌ ఫిట్‌ తో కొత్త అందాలను ఈ కొత్తబంగారు లోకం బ్యూటీ శ్వేతబసు ప్రసాద్‌ చూపించి అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ స్థాయి బికినీ ఫోటోలు గతంలో శ్వేత నుంచి రాలేదు. మొదటి సారి ఇంత బోల్డ్‌ ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఏం మెసేజ్ ను ఇండస్ట్రీకి ఇస్తున్నారు అంటూ కొందరు ఈ సమయంలో ప్రశ్నిస్తున్నారు.