వెండి తెరపై మళ్లీ శ్వేతామీనన్ రసికత్వం!
ఆ జానర్ చిత్రాలతో టాలీవుడ్ సహా సౌత్ లో అన్ని భాషల్లోనూ ఫేమస్ అయింది. ముఖ్యంగా 'రతినిర్వే దం' సినిమాతో కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకుంది.
By: Tupaki Desk | 5 Oct 2023 9:37 AM GMTమాలీవుడ్ హాట్ సంచలనం శ్వేతామీనన్ కెరీర్ లో టచ్ చేయని జోనర్ అంటూ లేదు. అన్ని రకాల చిత్రాల్లో నూ నటించింది. కానీ అమ్మడికి శృంగారభరిత చిత్రాలు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. ఆ జానర్ చిత్రాల్లో తన బ్రాండ్ అనతి కాలంలోనే వేయగల్గింది. షకీలా లాంటి నటీమణులు రిటైర్మెంట్ తీసుకున్నాక శ్వేతామీనన్ ఫాంలోకి రావడం..సక్సెస్ అవ్వడం అన్ని రకాలుగా కలిసొచ్చింది. మాలీవుడ్ లో ఓ బ్రాండ్ గా వెలిగిపోతుంది.
ఆ జానర్ చిత్రాలతో టాలీవుడ్ సహా సౌత్ లో అన్ని భాషల్లోనూ ఫేమస్ అయింది. ముఖ్యంగా 'రతినిర్వే దం' సినిమాతో కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్ దక్కించుకుంది. ఓ పాతికేళ్ల పెళ్లికాని కుర్నాడు (శ్రీజిత్ విజయ్) తనకన్నా వయసులో పది..పదిహేనేళ్లు పెద్దన రతి(శ్వేతామీనన్) పై మనసు పుడటం. .తొలుత కుర్రాడని రతి దూరం పెట్టడం...ఆ తర్వాత ఓ వర్షం కురిసిన రాత్రి ఆ దూరం ఎంత దగ్గరైంది! అనే ఆసక్తికర రసకత్వంతో కథ సాగుతుంది.
రతిపై మనసు పడిన బుజ్జి కోరికల్లో భాగంగా ఎలాంటి సంఘర్షణకు గురైయ్యాడు అన్నది తెరపై చూపించి న విధానం కుర్రకారుకి కనెక్ట్ అయింది. నేరేషన్ స్లోగా ఉన్నా..కంటెంట్ కుర్రాళ్లకు రీచ్ అయింది. అందుకే మరోసారి ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తొలుత ఈ చిత్రం 2011 లో రిలీజ్ అయింది. తాజాగా 4కెపార్మెట్ లో ఈనెల 11న రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్ కుర్రాళ్లలో మళ్లీ ఆసక్తిని తీసుకొచ్చేదే.
పెద్ద తెరపై ఇలాంటి సినిమాలు వచ్చి చాలా కాలమవుతోంది. ఈనేపథ్యంలో రతినిర్వేదం రీ-రిలీజ్ వార్తల్లో స్థానం దక్కించుకుంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సన్నివేశం ఎలా మారిపోయిందే తెలిసిందే. ఈ చిత్రాన్ని పి.పద్మరాజన్ రచించిన నవల ఆధారంగా టి.కె.రాజీవ్‌కుమార్ తెరకెక్కించారు. జి.సురేష్‌కుమార్ నిర్మించారు.