Begin typing your search above and press return to search.

పడవకి రంద్రం.. రిస్క్ చేసిన తండేల్ యూనిట్..!

లవ్ స్టోరీలో కలిసి నటించిన ఈ జంట మరో లవ్ స్టోరీ అది కూడా దేశభక్తితో కూడా కథలో భాగం అవ్వడంతో దీనిపై మరింత క్రేజ్ ఏర్పడింది.

By:  Tupaki Desk   |   25 Jan 2025 9:30 PM GMT
పడవకి రంద్రం.. రిస్క్ చేసిన తండేల్ యూనిట్..!
X

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన 3 సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సాంగ్స్ తోనే సినిమాకు హిట్ వైబ్ తీసుకొచ్చేశాడు డీఎస్పీ. నాగ చైతన్య, సాయి పల్లవి హిట్ పెయిర్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. లవ్ స్టోరీలో కలిసి నటించిన ఈ జంట మరో లవ్ స్టోరీ అది కూడా దేశభక్తితో కూడా కథలో భాగం అవ్వడంతో దీనిపై మరింత క్రేజ్ ఏర్పడింది.

ఈ సినిమాలో కథతో పాటు సముద్రం కూడా భాగమైంది. ఎక్కువ శాతం షూటింగ్ సముద్రం దాని పరిసర ప్రాంతాలకు సంబందించినవే ఉంటాయి. ఐతే సినిమా తీస్తున్న టైం లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తండేల్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్. సినిమా ఒక సీన్ సందురంలోకి వెళ్లి తీయాలని డైరెక్టర్ చెప్పగా డైరెక్టర్ తో పాటు తాను కొందరు అసిస్టెంట్స్ పడవలో సముద్రం లోపలికి వెళ్లామని.. ఐతే కొంత దూరం వెళ్లగానే పడవకి రాయి తగిలి రంద్రం పడిందని దాని వల్ల దానిలో నీళ్లు రావడం జరిగిందని అన్నారు శ్యామ్ దత్.

ఒక పక్క పడవ ఒంగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ టైం లో అటుగా ఒక పడవ వెళ్తుంటే దాన్ని రమ్మని చేతులు ఊపితే తామంతా తాగి చేతులు ఊపుతున్నామని వదిలి వెళ్లారు. ఐతే ఆ టైం లో మరో పడవ రావడం మా అందరినీ ఆ పడవ మీదకు ఎక్కించుకుని ఒడ్డుకు చేర్చడం జరిగిందని చెప్పుకొచ్చారు శ్యామ్ దత్. అంత రిస్క్ చేసి మరీ సినిమా చేశామని చెప్పుకొచ్చారు సినిమాటోగ్రాఫర్ శాం దత్. అంతేకాదు నాగ చైతన్య, సాయి పల్లవి ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ గురించి ఆయన ప్రస్తావించారు.

తండేల్ సినిమా సాంగ్స్ తోనే ఒక క్రేజీ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 7న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తుండగా కెరీర్ బెస్ట్ హిట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా హైలెస్సో సాంగ్ రిలీజ్ టైం లో కూడా డైరెక్టర్ చందు మొండేటి సినిమా మళ్లీ మళ్లీ చూస్తారని చెప్పి గట్టి నమ్మకాన్ని వెల్లబుచ్చారు. ఏది ఏమైనా తండేల్ కి అన్ని పాజిటివ్ వైబ్స్ వస్తుండగా అక్కినేని యువ సామ్రాట్ కి ఈ సినిమా ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.