Begin typing your search above and press return to search.

రేవ్ పార్టీ వివాదం.. యాంకర్ శ్యామల సీరియస్ రియాక్షన్!

గత కొన్ని రోజులుగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ వివాదం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.

By:  Tupaki Desk   |   22 May 2024 10:49 AM GMT
రేవ్ పార్టీ వివాదం.. యాంకర్ శ్యామల సీరియస్ రియాక్షన్!
X

గత కొన్ని రోజులుగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ వివాదం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. అలాగే పొలిటికల్ గ్రౌండ్ లో కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బడా నేతల కనెక్షన్ ఉన్నవారు, అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఆ పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ గురించి కన్నడ పోలీసులు పెద్ద ఎత్తున దర్యాప్తు చేపట్టి, మొత్తం 100 మంది ప్రముఖులు పాల్గొన్నారని వెల్లడించడంతో ఈ విషయం మీడియా, సోషల్ మీడియాలలో వైరల్ అయ్యింది.

ఈ వ్యవహారంలో టాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొందరు బహిరంగంగా వివరణ ఇవ్వాల్సిన స్థితి వచ్చింది. సీనియర్ నటుడు శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వంటి వారు తాము ఆ పార్టీకి వెళ్లలేదని, తాము అనవసరంగా ఈ గందరగోళంలోకి లాగబడ్డామని వివరించారు.

ఇదే సమయంలో, ఒక ప్రముఖ యాంకర్ వైసీపీ పార్టీ నేత కారులో ఉన్నారనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ చేసారు. అయితే, ఈ కారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యాంకర్ శ్యామలకి సంబంధించినదిగా పేర్కొనబడింది. ఈ నేపథ్యంలో శ్యామలపై అనేక తప్పుడు వార్తలు, దారుణమైన కామెంట్లు వెలువడటంతో తాను ఎటువంటి రేవ్ పార్టీలో పాల్గొనలేదని ఆమె స్పష్టం చేస్తూ మీడియాతో మాట్లాడారు.

"నాకు రేవ్ పార్టీ అంటే ఏమిటో కూడా తెలియదు. బెంగళూరులో ఎప్పుడు ఎక్కడ జరిగింది, అందులో ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయాలు నాకు అసలు తెలియదు. నా పేరును అనవసరంగా ఈ వివాదంలోకి లాగడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను. ఇది పూర్తిగా రాజకీయ కుట్రగా భావిస్తున్నాను," అని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, శ్యామల తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాను అని హెచ్చరించారు. "నాపై బురదజల్లే వారిపై పరువు నష్టం దావా వేసాను. జర్నలిస్టులు నిజాయితీతో ఉన్నవారు, అసత్య ప్రచారాలు చేయకుండా వాస్తవాలను ప్రతిపాదించాలి," అని శ్యామల వ్యాఖ్యానించారు.

శ్యామల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో, ఆమెకు మద్దతుగా చాలా మంది నిలుస్తున్నారు. ఆమెకు మద్దతు తెలుపుతూ, న్యాయబద్ధంగా ఆమె పట్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మొత్తానికి, బెంగళూరు రేవ్ పార్టీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. మరిన్ని ఫేక్ న్యూస్ లు, వివరణలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.