Begin typing your search above and press return to search.

ప్రభాస్ పెళ్లి పై.. పెద్దమ్మ శ్యామలాదేవి వైరల్ రెస్పాన్స్..

తాజాగా ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   7 July 2024 8:26 AM GMT
ప్రభాస్ పెళ్లి పై.. పెద్దమ్మ శ్యామలాదేవి వైరల్ రెస్పాన్స్..
X

టాలీవుడ్‌లో హీరోలు ఎందరో ఉన్నారు.. కానీ ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా.. కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉండే హీరోలు అరుదుగా ఉన్నారు. అలాంటి వారిలో ప్రభాస్ ఒకరు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలను అతని అభిమానులు విపరీతంగా ఆదరిస్తారు. కానీ ప్రభాస్ సినిమా అప్డేట్స్ కంటే కూడా అభిమానులు ఎక్కువగా ఎదురుచూసేది అతని పెళ్లి ఎప్పుడు అన్న వార్త గురించి. తాజాగా రిలీజ్ అయిన కల్కి చిత్రం సక్సెస్ తరువాత తిరిగి మళ్ళీ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

40 ఏళ్ళు దాటిన ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరు. ఈ నేపథ్యంలో అతని పెళ్లి వార్త కోసం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తుంది అనడంలో డౌట్ లేదు. మరోపక్క ఎక్కడ అతను సల్మాన్ ఖాన్ లాగా ఉండిపోతాడు అని అతని అభిమానులు కంగారుపడుతూ ఉంటారు. సాధారణంగా చాలా కామ్‌గా ఉండే ప్రభాస్ తన పెళ్లి విషయంలో కూడా ఎక్కడ ఏమి ప్రస్తావించడు.

ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అతను నటించిన ప్రతి హీరోయిన్‌తో ఏదో ఒక అఫైర్ ఉందంటూ గాసిప్స్ కూడా నడిచాయి. మరో పక్క కొందరు ప్రభాస్‌కి ఇప్పట్లో పెళ్లి కాదు అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసే జ్యోతిష్కులు కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రభాస్ పెద్దమ్మ పాల్గొన్న ఇంటర్వ్యూలో హోస్ట్ ప్రశ్నించగా ఆమె మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చారు.

తాజాగా ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంటర్వ్యూలో శ్యామలాదేవి మాట్లాడుతూ..”మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకు వెళుతుంది అన్న విషయం ప్రభాస్ ను చూస్తే తెలుస్తుంది.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ లో ఇక సక్సెస్ లేదని.. అతనికి విజయాలు దక్కవని ఎందరో అన్నారు. కానీ ఎవరు ఎన్ని మాట్లాడిన.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు కల్కి సక్సెస్ తర్వాత అతని రేంజ్ ఏంటో అందరికీ అర్థమవుతుంది. తాను చేసే సినిమాలు ప్రేక్షకులకు నచ్చాలి అని ఎంతో కష్టపడే మనస్తత్వం ప్రభాస్‌కి ఉంది. ఇక ప్రభాస్ పెళ్లి సమయం వచ్చినప్పుడు తప్పకుండా జరుగుతుంది. దానికి తగిన సమయం రావాలి. పైనుంచి కృష్ణంరాజు గారు అన్ని చూస్తూ ఉంటారు.. ప్రభాస్ లైఫ్ లో అన్నీ మంచి జరగాలి అని ఆయన ఆశించారు. అలాగే అంతా మంచే జరుగుతుంది.”అని అన్నారు.