Begin typing your search above and press return to search.

సిద్దార్థ్ ప్రెస్ మీట్‌కు వచ్చాడంటే కలకలమే..

నేను 2005లోనే సేఫ్ సెక్స్ గురించి అవగాహన కలిగిస్తూ.. నా చేతిలో కండోమ్ పట్టుకుని యాడ్ చేశాను. ఆరేళ్ల పాటు దీని కోసం ప్రభుత్వంతో కలిసి పని చేశాను.

By:  Tupaki Desk   |   9 July 2024 4:37 AM GMT
సిద్దార్థ్ ప్రెస్ మీట్‌కు వచ్చాడంటే కలకలమే..
X

సౌత్ ఇండియన్ హీరోల్లో బాగా ఔట్ స్పోకెన్ అని సిద్దార్థ్‌కు పేరుంది. అతను వేదికల మీద, ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూలలో చాలా అగ్రెసివ్‌గా మాట్లాడుతుంటాడు. ముఖ్యంగా సిద్ధార్థ్ తన సినిమా ప్రమోషన్ల కోసం మీడియాను కలిశాడంటే చాలు.. యూట్యూబ్ ఛానెళ్లకు బోలెడన్ని థంబ్ నైల్స్ క్రియేట్ అయిపోతాయి. అంత హాట్ హాట్‌గా ఉంటాయి తన కౌంటర్లు, సమాధానాలు.

'భారతీయుడు-2' సినిమా కోసం కమల్ హాసన్, శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సురేష్ బాబులతో కలిసి సోమవారం ప్రెస్ మీట్లో పాల్గొన్న సందర్భంగా సిద్దార్థ్ మరోసారి తన మార్కు చూపించాడు. కొన్ని ప్రశ్నలకు పేలిపోయే సమాధానాలు, మీడియాపై కౌంటర్లతో ఈ ప్రెస్ మీట్‌ను అతను వేడెక్కించేశాడు.

సినిమా టికెట్ల ధరలు పెంచాలని కోరే సినిమాలకు సంబంధించిన సెలబ్రెటీలు డ్రగ్స్, సైబర్ క్రైమ్‌కు వ్యతిరేకంగా వీడియోలు చేసి ఇవ్వాల్సి ఉంటుందని ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన కండిషన్ గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్నిస్తూ.. మీకు ఎంత వరకు సామాజిక బాధ్యత ఉంది అని సిద్ధును ప్రశ్నించాడు. దానికి సమాధానంగా.. "నా పేరు సిద్దార్థ్. నాకు 20 ఏళ్లుగా తెలుగు సినిమాలతో అనుబంధం ఉంది.

నేను 2005లోనే సేఫ్ సెక్స్ గురించి అవగాహన కలిగిస్తూ.. నా చేతిలో కండోమ్ పట్టుకుని యాడ్ చేశాను. ఆరేళ్ల పాటు దీని కోసం ప్రభుత్వంతో కలిసి పని చేశాను. నటుడిగా నా సామాజిక బాధ్యత అది. ఎవరూ చెప్పకుండానే మేం ఇలాంటివి చేస్తాం. అంతే తప్ప ఇది చేస్తేనే అది అని ఏ సీఎం చెప్పాల్సిన పని లేదు" అని సిద్ధు అన్నాడు. మరో జర్నలిస్ట్ కమల్ హాసన్‌కు ఏదో ప్రశ్న వేస్తే.. సిద్ధు ఇన్‌డైరెక్ట్‌గా గట్టి పంచ్ వేశాడు. సేనాపతి మన ముందుకు వస్తే గొప్ప ప్రశ్నలు వేసి గొప్ప సమాధానాలు రాబట్టాలి తప్ప.. చెత్త ప్రశ్నలు వేయకూడదంటూ కౌంటర్ ఇచ్చాడు సిద్ధు.