సిధ్- అదితీ.. అంత వయసు గ్యాప్ ఉందా?
ఇక పెళ్లి అనంతరం అదితి- సిద్ధార్థ్ 8 సంవత్సరాల వయస్సు అంతరం గురించి అభిమానుల్లో చర్చ మొదలైంది.
By: Tupaki Desk | 17 Sep 2024 2:30 AM GMTసిద్ధార్థ్- అతిదీ జంట సెప్టెంబర్ 16న పెళ్లి తేదీ అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ రోజు అందమైన జంట వివాహం జరిగింది. ఈ జంట తమ సోషల్ మీడియాలో కొన్ని హార్ట్ టచింగ్ ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేసారు. ఇక పెళ్లి అనంతరం అదితి- సిద్ధార్థ్ 8 సంవత్సరాల వయస్సు అంతరం గురించి అభిమానుల్లో చర్చ మొదలైంది. అయితే వారి ప్రేమ మధ్యకు వయసు ఒక అడ్డంకి కానే కాదు.
అదితి రావ్ హైదరి - సిద్ధార్థ్ ల ప్రేమకథ వివరాల్లోకి వెళితే... 2021లో తెలుగు చిత్రం `మహా సముద్రం` సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. షూటింగ్ సమయంలో ప్రేమించుకున్నారు. ఇది విడదీయరాని బంధంగా మారింది. నిజానికి అదితి- సిద్ధార్థ్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఒకరికొకరు నాణ్యమైన సమయాన్ని వెచ్చించేలా చూసుకున్నారు. ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ఈ జంట ఒకే కారులో వచ్చేవారు.
ఈ జంట ఆరంభం తమ ప్రేమాయణం గురించి దాచేయాలని ప్రయత్నించినా కానీ, పబ్లిక్ ఈవెంట్‌లలో వారి ప్రదర్శనలు రిలేషన్‌షిప్‌పై ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. 2023లో సిధ్ 44వ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పడంతో అదితీతో సిధ్ ఎఫైర్ గురించి పుకార్లు విపరీతంగా పెరిగాయి. అదే సంవత్సరం అక్టోబర్‌లో అదితి 37వ పుట్టినరోజున సిద్ధార్థ్ తన లేడీ లవ్‌కి ఒక అందమైన కవితను అంకితమిచ్చాడు. అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే సిద్ధార్థ్ అదితిని మొదటిసారిగా తన భాగస్వామి అని పేర్కొన్నాడు.
వోగ్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి తమ మొదటి కలయిక గురించి గుర్తు చేసుకుంటూ తాము సెట్ లో ఉన్నప్పుడు ఎలా కలుసుకునేవాళ్లమో చెప్పారు. సెట్ లో నెయ్యి ఇడ్లీల షేరింగ్ గురించి కూడా అదితీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ అందమైన జంట తరచుగా ఈవెంట్‌లు, రొమాంటిక్ డేట్ నుండి వారి లవ్-డోవీ ఫోటోగ్రాఫ్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది.
సిద్ధార్థ్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడో అదితి రావ్ హైదరీ వోగ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒక సంవత్సరం సరదాగా మాట్లాడిన తర్వాత చివరకు సిద్ధార్థ్ ఆమెకు ఎలా ప్రపోజ్ చేసాడంటే.. అతడు తన దివంగత నానీ (అమ్మమ్మ) ఉండే స్థలానికి వచ్చి సిధ్ ప్రతిపాదించాడని అదితీ తెలిపింది. నానీకి అదితీ ఎంతో సన్నిహితురాలు. సిధ్ మోకాలిపై తనకు ప్రపోజ్ చేసాడని తెలిపింది. తన చిన్ననాటి ప్లేస్ లో అతడు ప్రపోజ్ చేయగానే వెంటనే పడిపోయానని తెలిపింది. ఆ తర్వాత కథంతా తెలిసినదే. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒకటైన ఈ జంటకు తుపాకి తరపున శుభాకాంక్షలు.