Begin typing your search above and press return to search.

బీరు బిర్యాని జనాలు.. సిద్ధార్థ్ మళ్లీ టంగ్ స్లిప్..!

ఐతే జనం రావడం సిద్ధార్థ్ అన్నట్టుగా కామనే అయినా అవి కలెక్షన్స్ రూపంలో మారాలంటే మాత్రం అది పుష్ప 2 అయ్యుండాలని అతని మీద రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

By:  Tupaki Desk   |   10 Dec 2024 8:31 AM GMT
బీరు బిర్యాని జనాలు.. సిద్ధార్థ్ మళ్లీ టంగ్ స్లిప్..!
X

ఒక సినిమా ఈవెంట్ కి జనాలు వస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుందా.. అదేంటి ఈవెంట్ కి జనాలు వస్తే ఎలా రిలీజ్ తర్వాత టికెట్లు తెగి కలెక్షన్స్ వస్తేనే కదా సినిమా హిట్ అయ్యేది అనుకోవచ్చు. ఐతే పుష్ప 2 ఈవెంట్ కి జనాలు వచ్చారు.. ఆ జనాల వల్ల కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఐతే దీనిపై కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ టంగ్ స్లిప్ అయ్యాడు. రీసెంట్ గా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధార్థ్ పుష్ప 2 సినిమాకు బీహార్ లో అదే పాట్నాలో జరిగిన ఈవెంట్ కు వచ్చిన క్రౌడ్ గురించి మాట్లాడాడు.

ఆ సినిమాకు ఉన్న క్రేజ్ పుష్ప 1 కి వచ్చిన బజ్ చూసి అక్కడికి జనాలు వచ్చారని చెబితే సరిపోయేది అలా కాకుండా మన దగ్గర ఏదైనా కన్ స్ట్రక్షన్ వర్క్ దగ్గర జేసీబీ సౌండ్ వినిపిస్తేనే జనం ఒకచోట గుమిగూడతారని అన్నాడు. అంతేకాదు మన దేశంలో జన సమీకరణ పెద్ద విషయం కాదని జనం వస్తేనే సక్సెస్ అంటే ప్రతి పొలిటికల్ పార్టీ మీటింగ్ లో చాలా మంది జనం వస్తారని. వాళ్లందరు గెలుస్తున్నారా అని అన్నాడు సిద్ధార్థ్. అంతేకాదు బీరు బిర్యాని వల్లే జనాలు రాజకీయ సభలకు వస్తారని మనం మాట్లాడుకుంటామని అన్నారు. మన దేశంలో జనం గుముగూడటం ఒక సాధారణ విషయమని అన్నారు.

ఐతే జనం రావడం సిద్ధార్థ్ అన్నట్టుగా కామనే అయినా అవి కలెక్షన్స్ రూపంలో మారాలంటే మాత్రం అది పుష్ప 2 అయ్యుండాలని అతని మీద రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. తన సినిమా ప్రమోషన్స్ లో ఏదో ఒక మాట అది కావాలని అంటాడో లేదా అలా ఫ్లోలో వచ్చేస్తుందో కానీ సిద్ధార్థ్ చేసే కామెంట్స్ ఒక్కోసారి ఆడియన్స్ కి రుచించవు. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 చేస్తున్న సంచలనాలు చూసి కూడా సిద్ధార్థ్ ఈ కామెంట్స్ చేయడం అతని అమాయకత్వాన్ని తెలియచేస్తుంది.

అంతకుముందు కూడా తన మిస్ యు సినిమాను పుష్ప 2 కి వన్ వీక్ బిఫోర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా వారం తర్వాత పుష్ప 2 వస్తుంది దాని గురించి మీ స్పందన ఏంటని సిద్ధార్థ్ ని అడిగితే నా సినిమా వల్ల పుష్ప 2 భయపడాలి కానీ తనకేం లేదని అన్నాడు. తీరా చూస్తే పుష్ప 2 వైబ్ చూసి సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్నారు. మరి మైక్ పట్టుకుంటేనో.. ఏదో మీడియా అటెన్షన్ ను లాగేసుకోవాలనో ఇలాంటి కామెంట్స్ చేయడం తప్ప అనవసరమైన ఇష్యూస్ లో సిద్ధార్థ్ ఇన్వాల్వ్ అవ్వడం అతనికి అలవాటుగా మారిందని చెప్పొచ్చు.