Begin typing your search above and press return to search.

మ‌రో 'కాంతార' రెడీ అవుతోందా?

దీప‌క్ మిశ్రా ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇందులో సిద్దార్ధ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తు న్నాడు. హిందూ పురాణాల ఆధారంగా ఈ క‌థ రెడీ అవుతోంది.

By:  Tupaki Desk   |   22 Sep 2024 5:50 AM GMT
మ‌రో కాంతార రెడీ అవుతోందా?
X

ఇండ‌స్ట్రీలో మ‌రో 'కాంతార' రెడీ అవుతోందా? హిందుపురాణాల ఆధారంగా జాన‌ప నేప‌థ్యంలో 'కాంతార'ని పోలిన సినిమా వ‌స్తుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. రిష‌బ్ శెట్టి స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన 'కాంతార' ఎంత‌పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిదే. 400 కోట్ల వ‌సూళ్ల‌తో క‌న్న‌డ చిత్రం ఓ రికార్డును సృష్టించింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా అసాధార‌ణ వ‌సూళ్ల‌తో దేశం మొత్తం క‌న్న‌డ ఇండ‌స్ట్రీ వైపు చూసేలా చేసిందా చిత్రం.

ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్ రెడీ అవుతోంది. ఏకంగా వంద‌ల కోట్ల‌తోనే హోంబ‌లే ఫిల్మ్స్ ఈ ప్రీక్వెల్ నిర్మించ‌డానికి ముందుకొచ్చింది. ఈ నేప‌థ్యంలో 'కాంతార' స్పూర్తితో బాలీవుడ్ కూడా ఇలాంటి నేప‌థ్యం గ‌ల చిత్రానికి పూనుకుంది. దీప‌క్ మిశ్రా ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇందులో సిద్దార్ధ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తు న్నాడు. హిందూ పురాణాల ఆధారంగా ఈ క‌థ రెడీ అవుతోంది.

స్క్రిప్ట్ కి సంబంధించిన ప‌నులు స‌హా ప్రీ ప్రొడ‌క్ష‌న్ మొత్తం పూర్తి చేసి వ‌చ్చేది ద్వితియార్ధంలో సెట్స్ కు వెళ్ల‌డానికి రెడీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏక్తా క‌పూర్ నిర్మిస్తున్నారు. ఇలాంటి బ్యాక్ డ్రాప్లో ఇంత‌వ‌ర‌కూ బాలీవుడ్ ఏ ద‌ర్శ‌క‌, నిర్మాత సినిమాలు నిర్మించ‌లేదు. హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాలు చాలా వ‌చ్చాయి. కానీ జాన‌పదాన్ని నేప‌థ్యంగా తీసుకున్న‌ది లేదు. పైగా జాన‌ప‌ద క‌ళ‌ల‌కు భార‌త‌దేశం ఎంతో ప్ర‌సిద్ది.

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ నుంచి ఆ నేప‌థ్యాన్ని తీసుకోవ‌డం ఇంట్రెస్టింగ్. సిద్దార్ధ్ మ‌ల్హోత్రా ఇలాంటి క‌థ‌లో న‌టించ‌డానికి ముందుకు రావ‌డం సినిమాకి క‌లిసొచ్చే అంశం. అత‌డికి యువ‌త‌లో ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ఉంది. కానీ ఈ సినిమా కోసం ఆ ఇమేజ్ ని ప‌క్క‌న‌బెట్టి ప‌నిచేస్తున్నాడు. ప్ర‌స్తుతం సిద్ధార్త్ మ‌ల్హోత్రా దినేష్ విజ‌న్ నిర్మిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రంలో న‌టిస్తున్నాడు.