Begin typing your search above and press return to search.

సిద్ధుకి మళ్లీ అదే రిజల్ట్..!

తమిళ నటుడే అయినా తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్.

By:  Tupaki Desk   |   14 Dec 2024 8:37 AM GMT
సిద్ధుకి మళ్లీ అదే రిజల్ట్..!
X

తమిళ నటుడే అయినా తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్. తెలుగులో నువ్వస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు చేసి అప్పటి యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ కొన్నాళ్లు కోలీవుడ్ కే పరిమితమై సినిమాలు చేస్తూ వచ్చాడు. ఐతే మధ్యలో ఎన్ టీ ఆర్ బాద్షా లో కనిపించిన సిద్ధార్థ్ ఆఫ్టర్ లాంగ్ టైం మహాసముద్రం సినిమాలో నటించాడు. శర్వానంద్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సిద్ధార్థ్ కి ఆ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.

మళ్లీ అప్పటి నుంచి సిద్ధార్థ్ తన సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఐతే తనను టాలీవుడ్ సరిగా గుర్తించలేదు. తనకు అవార్డులు రాకుండా చేశారంటూ కొందరి మీద అస్త్రాలు వేస్తూ ఉండే సిద్ధార్థ్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే ఏదో ఒక ట్రోలింగ్ స్టఫ్ వదిలేస్తాడు. లేటెస్ట్ గా అతను మిస్ యు అనే సినిమా చేశాడు. పుష్ప 2 రిలీజ్ కు వారం ముందు చేయాల్సిన ఆ సినిమా ప్రమోషన్స్ లో తన సినిమా వస్తుంటే పుష్ప 2 భయపడాలని అన్నాడు.

ఐతే పుష్ప 2 బజ్ చూసో మరో కారణమో కానీ సిద్ధార్థ్ మిస్ యు వాయిదా వేసుకున్నాడు. మళ్లీ డిసెంబర్ 13న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో చెన్నైలో ఒక ఇంటర్వ్యూలో పుష్ప 2 పాట్నా ఈవెంట్ పై జేసీబీ ఆడించినా జనాలు వస్తారని కామెంట్స్ చేశాడు. ఐతే దాన్ని మళ్లీ కవర్ చేయాలని చూశాడు కానీ వర్క్ అవుట్ కాలేదు.

ఇక శుక్రవారం రిలీజైన మిస్ యు సినిమాకు తెలుగులో దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. నిన్న హడావిడి అంత అల్లు అర్జున్ అరెస్ట్ గురించే ఉంది. అందుకే సిద్ధార్థ్ సినిమాను ఎవరు పట్టించుకోలేదు. సినిమా టాక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. డైరెక్టర్ కావాలనుకున్న హీరొ యాక్సిడెంట్ వల్ల రెండేళ్ల గతాన్ని మర్చిపోతాడు. ఆ తర్వాత బెంగుళూరు లో కేఫ్ లో జాబ్ చేస్తుంటే హీరోయిన్ ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆమె రిజెక్ట్ చేస్తుంది. ఆమె ఎందుకు ఒప్పుకోదంటే దానికి ఒక బ్యాక్ స్టోరె ఉంటుంది. అదే మిస్ యు కథ. ఇది కాస్త హాయ్ నాన్న కథకు దగ్గరగా ఉంటుంది.

ఈ సినిమా దర్శకుడు ఎన్ రాజశేఖర్ అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ క్లారిటీ లేదు. ఇక సినిమాకు లెంగ్త్ తక్కువే అయినా బోర్ అనిపిస్తుంది. నా సామిరంగతో హిట్ అందుకున్న ఆషికా రంగనాథ్ ఆకట్టుకోలేదు. కొన్ని సీన్లు మాత్రమే ఇంప్రెస్ చేయగా ఓవరాల్ సినిమా మెప్పించలేదు. ఈ సినిమాకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. అందుకే సినిమాను ఎవరు పట్టించుకోలేదు.