ఇంతకు సిద్దార్థ్ సినిమా కలెక్షన్లు ఎంత?
తెలుగులో సినిమాలు తగ్గించినా క్రేజ్ అలానే కాపాడుకున్నారు. రీసెంట్ గా మిస్ యు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సిద్ధార్థ్.
By: Tupaki Desk | 18 Dec 2024 5:30 AM GMTటాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరోస్ లిస్ట్ లో సిద్ధార్థ్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. బొమ్మరిల్లు సహా పలు చిత్రాలతో సూపర్ ఫేమ్ సొంతం చేసుకున్నారు. తెలుగులో సినిమాలు తగ్గించినా క్రేజ్ అలానే కాపాడుకున్నారు. రీసెంట్ గా మిస్ యు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సిద్ధార్థ్.
లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాజశేఖర్ తెరకెక్కించిన మిస్ యు సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. అయితే రిలీజ్ కు ముందు కోలీవుడ్ లో మూవీపై మోస్తరు బజ్ ఏర్పడినప్పటికీ.. టాలీవుడ్ లో ఎలాంటి హైప్ లేదు. కానీ రొమాంటిక్ జోనర్ లో వచ్చిన సినిమా కాబట్టి యావరేజ్ హిట్ అవుతుందని అంచనా వేశారు.
కానీ రిజల్ట్ అంతా తలకిందులైంది. కొన్ని రివ్యూలు.. సినిమా యావరేజ్ అని చెప్పినప్పటికీ వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు రోజుల్లో కేవలం మిస్ యు మూవీ రూ.2.39 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజు రూ.41 లక్షలు మాత్రమే సాధించింది. దీంతో సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచేటట్లు కనిపిస్తోంది.
అయితే సిద్ధార్థ్ మూవీపై ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ గట్టిగా పడినట్లు ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందుకే రీసెంట్ గా రీ రిలీజైన ఆయన చిత్రాలు బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా రాబట్టిన దానిలో సగం కూడా మిస్ యు చిత్రం ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ లో రాబట్టలేదని అంటున్నారు.
అందుకే కామెంట్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. సిద్ధార్థ్ వ్యాఖ్యలు.. బన్నీని తక్కువ చేసినట్లు ఉన్నాయని, అలాంటి కామెంట్స్ చేస్తే అభిమానులు, సినీ ప్రియులు ఇష్టపడరన్న విషయం గుర్తుంచుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు పుష్ప -2 రూ.1400 కోట్లకుపైగా సాధిస్తే.. మిస్ యు రూ.2 కోట్లకుగా రాబట్టిందని కంపేర్ చేస్తున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం.. పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం సిద్ధార్థ్ ఇటీవల మాట్లాడారు. సినిమాకు, దాని ప్రమోషన్స్ కు ప్రజలు రావడానికి సంబంధం లేదన్నారు. ఏ పనులు జరుగుతున్నా చూడడానికి జనాలు వస్తారని, ఊర్లలో ఇల్లు కూల్చడానికి జేసీబీ వచ్చిన చూడడానికి వస్తారని అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ కు అనేక మంది హర్ట్ అయ్యారు. ఆ తర్వాత తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగింది!