నయన్, సిద్ధార్థ్ 'టెస్ట్' మూవీ.. టీజర్ ఎలా ఉందంటే?
స్టార్ హీరోయిన్ నయనతార, ప్రముఖ నటుడు మాధవన్, సిద్ధార్థ్ కలిసి నటించిన మూవీ టెస్ట్. మీరా జాస్మిన్ కీలకపాత్రలో కనిపించనుంది.
By: Tupaki Desk | 4 Feb 2025 7:32 AM GMTస్టార్ హీరోయిన్ నయనతార, ప్రముఖ నటుడు మాధవన్, సిద్ధార్థ్ కలిసి నటించిన మూవీ టెస్ట్. మీరా జాస్మిన్ కీలకపాత్రలో కనిపించనుంది. సుమారు పదేళ్ల తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఆమె రీఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి. అయితే స్పోర్ట్స్ డ్రామాగా కొత్త డైరెక్టర్ శశి కాంత్.. టెస్ట్ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.
వైనాట్ స్టూడియోస్ బ్యానర్ పై చక్రవర్తి రామచంద్, శశికాంత్ నిర్మించారు. అయితే టెస్ట్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి ఏడాదిపైగా పూర్తైనట్లు తెలుస్తోంది. 2023 ఏప్రిల్ లో చిత్రీకరణ మొదలవ్వగా.. 2024 జనవరిలో కంప్లీట్ అయినట్లు అప్పట్లో టాక్ వినిపించింది. అయితే షూటింగ్ కంప్లీట్ అయ్యి ఏడాది అవుతున్నా ఇంకా రిలీజ్ కాలేదు.
ఎలాంటి అప్డేట్స్ కూడా రాలేదు. అదే సమయంలో సినిమా థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కు రానుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా లీడ్ రోల్స్ మాధవన్, నయనతార, సిద్ధార్థ్.. నెట్ ఫ్లిక్స్ లో నెక్స్ట్ ఏం రానుందో.. ఫిబ్రవరి 3న చూడండంటూ పోస్ట్ పెట్టారు. దీంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది.
అనుకున్నట్లే నిన్న నెట్ ఫ్లిక్స్.. టెస్ట్ మూవీ తమ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించింది. దాంతోపాటు చిన్న గ్లింప్స్ ను పోస్ట్ చేసింది. తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ టీజర్ ను విడుదల చేసి అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో టెస్ట్ టీజర్ ఫుల్ వైరల్ గా మారింది. అందరినీ ఆకట్టుకుంటోంది.
అయితే టీజర్ లో సిద్ధార్థ్ ఓ క్రికెట్ ప్లేయర్ గా కనిపించారు. "జీవితం ఒక ఆటలాంటిది! ఇందులో రూల్స్ ఉండటమే దానికి అందం' అంటూ నాలుగు రూల్స్ గురించి సిద్ధార్థ్ చెప్తున్న సమయంలో నయన్ తార, మాధవన్ ను పరిచయం చేస్తారు. అదే సమయంలో ఒక పిల్లవాడితో మీరా జాస్మిన్ ను చూపించారు.
ఆ తర్వాత వాళ్ల జీవితాల గురించి క్లుప్తంగా చూపిస్తారు. చివర్లో వికెట్స్ పై బైల్స్ ను కింద పడేయడంతో ఇంట్రెస్టింగ్ గా ముగిసింది. అయితే టీజర్ లో విజువల్స్ చాలా క్లియర్ అండ్ డీసెంట్ గా ఉన్నాయి. ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఓవరాల్ గా టీజర్ ను మేకర్స్ సరైన రీతిలో కట్ చేశారని చెప్పాలి. సినిమాపై అంచనాలు పెరిగేలా రూపొందించారు. మరి టెస్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.