సిద్దు, అదితీ మళ్లీ పెళ్లి..!
వీరి వివాహం సెప్టెంబర్‌లో తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో ఉండే 400 ఏళ్ల చరిత్ర ఉన్న రంగనాథ స్వామి దేవాలయంలో జరిగింది.
By: Tupaki Desk | 27 Nov 2024 10:21 AM GMTరెండు నెలల క్రితం హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితీ రావు హైదరిల వివాహం జరిగిన విషయం తెల్సిందే. మహా సముద్రం సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ఒక్కటి అయ్యారు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కరు. దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు వీరి ప్రేమ విషయం గురించి మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. చివరకు ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి, ఆ వెంటనే పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం సెప్టెంబర్‌లో తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో ఉండే 400 ఏళ్ల చరిత్ర ఉన్న రంగనాథ స్వామి దేవాలయంలో జరిగింది.
సిద్దార్థ్, అదితీ రావు హైదరిల వివాహ మరోసారి జరిగింది. అప్పుడు కేవలం అతి కొద్ది మంది బందు మిత్రుల సమక్షంలో జరిగిన వీరి పెళ్లి ఇప్పుడు చాలా వైభంగా రాజస్థాన్‌లోని ఒక రిసార్ట్స్‌లో వైభవంగా జరిగింది. ఈసారి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న వీరిద్దరు ఫోటోలను షేర్ చేసుకున్నారు. అదితీ రావు హైదరి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఎప్పుడు జరిగింది అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఇటీవలే పెళ్లి జరిగిందని మాత్రం ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి పలువురు ప్రముఖులు బందు మిత్రులు హాజరు అయ్యారు.
మరోసారి సిద్దార్థ్, అదితీ రావు హైదరి పెళ్లి విషయమై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీరి ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇటీవల సిద్దార్థ్ ఒక సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ తనకు ఒక దేవత భార్యగా లభించింది అంటూ అదితీ రావు పై కామెంట్స్ చేశాడు. ఆమె భార్యగా లభించడం తన అదృష్టం అన్నట్లుగా సిద్దు మాట్లాడాడు. గతంలో వివాహం అయిన సిద్దు విడాకులు తీసుకుని అదితిని వివాహం చేసుకున్నారు. సుదీర్ఘ కాలంగా హీరోగా కొనసాగుతున్న సిద్దు ఇప్పటికీ తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఇక అదితీ రావు హైదరి తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి అయినా బాలీవుడ్లో సినిమాలు చేసింది. కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ ఈమె నుంచి పలు సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే. చాలా పద్దతి అయిన పాత్రలను చేయడం ద్వారా అదితి రావు అంటే అందరికీ చాలా గౌరవం అనడంలో సందేహం లేదు. అందుకే సిద్దార్థ్‌తో ఆమె పెళ్లి జరిగినప్పుడు మీడియాలో ప్రముఖంగా చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి ఆమె పెళ్లి ఫోటోలు షేర్ చేయడంతో ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మంది ఆమెను అభినందిస్తూ ఉన్నారు.