Begin typing your search above and press return to search.

బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి సందడి.. స్టార్స్ తో నిండిపోయింది

ఈ పెళ్లి వేడుక కోసం బ్రహ్మానందం సినీ, రాజకీయ ప్రముఖులు అందరిని కలిసి పేరుపెరుని ఆహ్వనాయించారు

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:27 AM GMT
బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి సందడి.. స్టార్స్ తో నిండిపోయింది
X

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్ధ్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. పెద్ద కొడుకు ఇప్పటికే పెళ్లి చేసుకొని అమెరికాలో బిజినెస్ చేస్తున్నారు. చిన్న కొడుకు సిద్దార్ధ్ కూడా సినిమా ఇండస్ట్రీ వైపు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తాజాగా సిద్దార్ధ్ కొత్తజీవితంలోకి అడుగుపెట్టారు. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్యతో అతను ఏడడుగులు నడిచారు.


ఐశ్వర్య డాక్టర్ గా పని చేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం అని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుక కోసం బ్రహ్మానందం సినీ, రాజకీయ ప్రముఖులు అందరిని కలిసి పేరుపెరుని ఆహ్వనాయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది.


ఈ పెళ్లి వేడుకకి అతిరథమహారధులు అందరూ హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ పెళ్ళికి అటెండ్ అయ్యారు.


టాలీవుడ్ నుంచి నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి హాజరై వధూవరులని ఆశీర్వదించారు. శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు హాజరై విషెస్ చెప్పారు.


వీరితో పాటుగా దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, రఘు బాబు తదితరులు హాజరయ్యారు. ఈ బ్రహ్మానందం టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి ఆత్మీయులు కావడంతో ఇండస్ట్రీలో చిన్న స్థాయి నటుల నుంచి స్టార్స్ వరకు అందరూ ఈ పెళ్లి వేడుకకి హాజరు కావడం విశేషం.