కూతురు సెంటిమెంట్‌తో సిద్ధార్థ్.. ఈ సారైనా గట్టెక్కుతారా
ఆయన కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ చిత్తా. ఈ చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు. సినిమాను రెడ్ జెయింట్ మూవీస్, ఈటాకీ ఎంటర్‌టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
By: Tupaki Desk | 27 Sep 2023 4:07 PM GMTటాలీవుడ్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటాన, బొమ్మరిల్లు, ఓయ్ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్‌లో నటించి యూత్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్. ఆయన కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ చిత్తా. ఈ చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు. సినిమాను రెడ్ జెయింట్ మూవీస్, ఈటాకీ ఎంటర్‌టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఈ సినిమా మరో రోజులో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా సిద్ధార్థ్ ఓ చైన్నెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తాను సహజత్వంతో కూడిన మంచి కథ చిత్రం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. అందుకే ఈ సినిమాను నిర్మించినట్లు పేర్కొన్నారు.
నిర్మాతగా మారాలని నేను అనుకున్నప్పుడు ఎక్కడా రాజీ పడకుండా సహజత్వంతో కూడిన మంచి కథ ఉన్న చిత్రం చేయాలని అనుకున్నాను. అందుకే ప్రీ ప్రొడక్షన్ కోసమే దాదాపు రెండేళ్ల సమయం తీసుకున్నాను. సినిమాలోని చాలా సీన్స్‌ను పళనిలో లైవ్‌గా షూట్ చేశాం. అని సిద్ధార్థ్ అన్నారు. ఈ చిత్రం తన నటనను చూసి ప్రశంసించిన సినీ ప్రముఖులకు, అభిమానులకు, సినీ ప్రియులకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
ఇకపోతే ఈ చిత్రంలో నిమిషా సజయన్, అంజలి నాయర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడలో సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రానికి ఎస్.యం అరుణ్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించారు.
బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే ఓ ఎమోషనల్ డ్రామానే ఈ చిత్రం. అంతా సాఫీగా సాగే జీవితంలో తన కూతురు కిడ్నాప్‌కు గురవ్వగా.. ఆమె కోసం సిద్ధార్థ్ చేసే పోరాటమే ఈ సినిమా కథ అని అర్థమవుతోంది. మరి ఈ కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే. కాగా, గత కొంతకాలంగా సిద్దార్థ్‌కు సరైన హిట్ లేదు. రీసెంట్గా వచ్చిన టక్కర్ కూడా అంతగా ఆడలేదు. మరి ఈ చిత్రంతోనైనా సిద్ధార్థ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతడో లేదో చూడాలి.