కియారా కి మొదటి వార్షికోత్సవ బహుమానం ఇదే
కియారా తాము వార్షికోత్సవం సందర్భంగా ట్రిప్ కు వెళ్లాం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. సిద్దార్థ్ తనకు ఆ ట్రిప్ ను వివాహ వార్షికోత్సవ బహుమానంగా ఇచ్చాడు అంది.
By: Tupaki Desk | 14 Feb 2024 3:15 AM GMTఆన్ స్క్రీన్ రొమాన్స్ తో మతి పోగొట్టిన సిద్దార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ లు గత ఏడాది ఫిబ్రవరి నెలలో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడం, పెద్దల సమక్షంలో పెళ్లి జరిగి పోవడం చకచకా జరిగిపోయాయి. ఈ అందమైన జంట ఈ ఏడాది కాలం పాటు తెగ సందడి చేశారు.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉండే ఈ జంట తాజాగా దుబాయిలోని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ కియారా మరియు సిద్దార్థ్ ను మొదటి వార్షికోత్సవ బహుమానం గురించి ప్రశ్నించిన సమయంలో వారి నుంచి ఆసక్తికర సమాధానం లభించింది.
కియారా తాము వార్షికోత్సవం సందర్భంగా ట్రిప్ కు వెళ్లాం అన్నట్లుగా చెప్పుకొచ్చింది. సిద్దార్థ్ తనకు ఆ ట్రిప్ ను వివాహ వార్షికోత్సవ బహుమానంగా ఇచ్చాడు అంది. ఆ ట్రిప్ ను తాము బాగా ఎంజాయ్ చేశాం. అందులో ఇద్దరం కూడా చాలా సంతోషంగా గడిపాము అంటూ కియారా చెప్పుకొచ్చింది.
సాధారణంగా ఇద్దరు సెలబ్రిటీలు అవ్వడంతో కనీస సమయం కూడా ఒకరికి ఒకరు ఇచ్చుకునేంత ఉండదు. కనుక వారు ఇలా ట్రిప్ కి వెళ్లడం అనేది కచ్చితంగా పెద్ద బహుమానం అనడంలో సందేహం లేదు. కియారా అద్వానీ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో పాటు పలు హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఇక సిద్దార్థ్ కూడా వరుసగా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాడు.