Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం.. మరోసారి సిద్ధార్థ్ ఏమన్నారంటే..

ఆ సినిమాలలో నటించే నటీనటులు అందరూ డ్రగ్స్ కి వ్యతిరేకంగా సందేశం ఇచ్చే వీడియోలు రిలీజ్ చేయాలని కోరారు.

By:  Tupaki Desk   |   9 July 2024 3:36 AM GMT
సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం.. మరోసారి సిద్ధార్థ్ ఏమన్నారంటే..
X

డ్రగ్స్ పై పోరాటంలో సెలబ్రెటీలు అందరూ ముందుకొచ్చి వీడియో బైట్స్ రిలీజ్ చేయాలని, పబ్లిక్ ని అలెర్ట్ చేస్తూ సందేశం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వానికి అడిగే సెలబ్రెటీలు డ్రగ్స్ కంట్రోల్ కోసం పోరాటం చేస్తున్న మాకు సపోర్ట్ చేయాలని ఓ సమావేశంలో అడిగారు. ఆ సినిమాలలో నటించే నటీనటులు అందరూ డ్రగ్స్ కి వ్యతిరేకంగా సందేశం ఇచ్చే వీడియోలు రిలీజ్ చేయాలని కోరారు.

దీనిపై టాలీవుడ్ సెలబ్రెటీల నుంచి రేవంత్ రెడ్డి కి పూర్తిస్థాయిలో మద్దతు లభించింది. కచ్చితంగా మా వైపు నుంచి డ్రగ్స్ పై చేస్తోన్న పోరాటంలో సహకారం ఉంటుందని, డ్రగ్స్ ఫ్రీ కోసం సోషల్ మెసేజ్ ఇవ్వడానికి ముందుకొస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ఇండియన్ 2 మూవీ జులై 12న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ఇందులో కమల్ హాసన్, సిద్ధార్ధ్ పాల్గొంటున్నారు.

తాజాగా జరిగిన మీడియా మీట్ లో డ్రగ్స్ కంట్రోల్ కోసం సెలబ్రెటీలు ముందుకు రావాలనే రేవంత్ రెడ్డి డిమాండ్ పై మీ అభిప్రాయం ఏంటనే జర్నలిస్ట్ సిద్ధార్ధ్ ని అడిగారు. ఒక సీఎం చెబితే ఎవ్వరికి బాధ్యత రాదు. తమకి తాముగా బాధ్యత తీసుకోవాలి. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేస్తేనే మీకు సహకారం అందిస్తాం అని ఇప్పటి వరకు మాట్లాడలేదు. గతంలో నేను ఉమ్మడి ఏపీలో కండోమ్స్ చేతితో పట్టుకొని హోర్డింగ్స్ పై ఫోటోల కోసం నిలబడ్డాను. అప్పుడు దాని గురించి ప్రచారం చేయడం నా బాధ్యత అని చేసానని చెప్పుకొచ్చారు.

అయితే సిద్ధార్ధ్ చెప్పిన మాటలు కాస్తా వివాదంగా మారడంతో ఓ వీడియో రిలీజ్ చేసి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియా మీట్ లో నేను మాట్లాడిన మాటలని తప్పుగా అర్ధం చేసుకున్నారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చేసే పోరాటంలో మా పూర్తి మద్దతు రేవంత్ రెడ్డికి ఉంటుంది. భారతీయుడు 2 మూవీలో మెయిన్ మెసేజ్ జీరో టోలరెన్స్… అది అవినీతికి, అలాగే డ్రగ్స్ లాంటి మహమ్మారికి వ్యతిరేకంగా కూడా ఉంటుంది.

పిల్లల భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంటుంది. ఇలాంటి పోరాటంలో ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సినీ పరిశ్రమ ఎప్పుడు ముందుకుంటుంది. నా కెరియర్ లో చాలా సార్లు సామాజిక అంశాలపై మాట్లాడని, అలాగే సామాజిక వ్యతిరేక విధానాలపై నా పోరాటం కొనసాగించాను. ఇకపైన కూడా నా మద్దతు ఉంటుంది అని సిద్ధార్ధ్ వీడియోలో పేర్కొన్నాడు.