రీ రిలీజ్ హవా.. కొత్త సినిమా కంటే ఎక్కువ
ఆ టైంలో మూవీ యావరేజ్ రిజల్ట్ అందుకుంది. అయితే ప్రేమకథా చిత్రాలు గురించి మాట్లాడుకుంటే ఓయ్ మూవీ అందరికి వెంటనే గుర్తుకొస్తుంది.
By: Tupaki Desk | 15 Feb 2024 4:15 AM GMTఒకప్పుడు టాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకొని లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న సిద్ధార్ధ్ ఉన్నపళంగా తెలుగు సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి కోలీవుడ్ లోకి వెళ్లి డిఫరెంట్ కథలు, డిఫరెంటర్ క్యారెక్టర్స్ తో మూవీస్ చేస్తూ వస్తున్నాడు. అయితే కోలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత సిద్ధార్ధ్ చేసిన సినిమాలు ఏవీ కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసిన పెద్ద ఆదరణకి నోచుకోలేదు.
గత ఏడాది చిన్నా అనే సినిమాతో సిద్ధార్ధ్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. తమిళంలో ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. సిద్ధార్ధ్ ఈ మూవీని సొంతంగా నిర్మించారు. దీంతో తెలుగు, కన్నడ భాషలలో కూడా రిలీజ్ చేయడంతో పాటు గట్టిగా ప్రమోట్ చేశారు. సినిమా అద్భుతంగా ఉంటుందని, ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలని కోరారు. ఈ సినిమా మీరు చూడకపోతే మళ్ళీ తెలుగులో నా సినిమాలు రావని కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు .
అయితే తెలుగు ప్రేక్షకులకి చిన్నా మూవీ పెద్దగా కనెక్ట్ కాలేదని చెప్పాలి. వన్ టైం వాచబుల్ అని సినీ విశ్లేషకులు కూడా రివ్యూలు ఇచ్చేశారు. కొత్తదనం, కొత్త కథలు, కొత్త క్యారెక్టర్స్ అంటూ మాతృభాషలో సిద్ధార్ధ్ ఎన్ని సినిమాలు చేసిన ఇప్పటికి తెలుగు ఆడియన్స్ అతన్ని ఒక బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, ఓయ్ లాంటి సినిమాలలో ఉన్న లవర్ బాయ్ గానే చూడటానికి ఇష్టపడుతున్నారని స్పష్టం అవుతుంది. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా సిద్ధార్, షామిలి లీడ్ రోల్ లో నటించిన ఓయ్ మూవీని రీరిలీజ్ చేశారు.
ఆ టైంలో మూవీ యావరేజ్ రిజల్ట్ అందుకుంది. అయితే ప్రేమకథా చిత్రాలు గురించి మాట్లాడుకుంటే ఓయ్ మూవీ అందరికి వెంటనే గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో సాంగ్స్, సిద్ధార్ధ్, షామిలి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చాలా మంది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే రీరిలీజ్ చేసిన మంచి ఆదరణ లభించింది. కొత్త సినిమాగా వచ్చిన చిన్నా మూవీకి కూడా లభించనంత ఆదరణ పాత సినిమా ఓయ్ కి లభించడం విశేషం.
ఒక విధంగా ప్రేమికుల రోజు రావడం, అలాగే తెలుగు ఆడియన్స్ సిద్ధార్ధ్ ని ఆ తరహా పాత్రలలో కనిపిస్తే చూడటానికి సిద్ధంగా ఉన్నారని ఓయ్ మూవీకి వస్తోన్న ఆదరణ చెబుతోంది. అయితే సిద్ధార్ధ్ మాత్రం లవర్ బాయ్ తరహా క్యారెక్టర్స్ చేయడానికి అంతగా ఆసక్తిగా లేడు. తెలుగులో తెలుగులో సిద్ధార్ధ్ మహా సముద్రం మూవీలో నటించాడు. ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు లభించిన మూవీ డిజాస్టర్ అయ్యింది.