Begin typing your search above and press return to search.

సిద్ధార్ధ్ రాయ్ ట్రైలర్.. పిచ్చి ప్రేమలో హై ఏమోషన్

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ కు సినీ ప్రియుల మంచి రెస్పాన్స్ వచ్చింది

By:  Tupaki Desk   |   23 Jan 2024 6:30 AM GMT
సిద్ధార్ధ్ రాయ్ ట్రైలర్.. పిచ్చి ప్రేమలో హై ఏమోషన్
X

మహేశ్ బాబు అతడు సినిమాలో బ్రహ్మానందం పొట్టపై పంచ్ ఇచ్చి.. మన స్కూల్ బెంచ్‌లా ఎంత గట్టిగా ఉందోరా అని డైలాగ్ చెప్పిన బుడ్డోడు గుర్తున్నాడా? ఆ బాలనటుడు దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ రాయ్ తో దీపక్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ దర్శకుల దగ్గర పనిచేసిన వి యశస్వి.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ కు సినీ ప్రియుల మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ ను అట్రాక్ట్ చేసేలే ప్రోమాస్ తో క్రేజీ బజ్ ను క్రియేట్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా.. బలమైన భావోద్వేగాలతో కూడిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ మారింది.

మై కైండ్ ఆఫ్ లవ్ ఈజ్ డిఫెరెంట్.. దిస్ ఈజ్ సిద్ధార్ధ్ రాయ్.. మై ఏజ్ 21 అంటూ హీరో చెబుతున్న పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. హీరో పుట్టుకతో మేధావి. లాజిక్స్‌తో బ్రతుకుతాడు. లాజిక్స్‌‌లో తనకి ఎవరూ సాటిలేరు. తిండి, నిద్ర, శృంగారం.. ఈ మూడు ఉంటే చాలు అనుకుంటాడు. అయితే, తన జీవితంలోకి వచ్చిన ఇందు( ఒకమ్మాయి) అతడిని నిజమైన ప్రేమ ఏంటో చూపిస్తుంది. ఆ తరువాత సిద్ధార్థ్ రాయ్ జీవితం మారిపోతుంది. పిచ్చోడు అయిపోయి ప్రవర్తిస్తుంటాడు. అందుకు జైలుకు కూడా వెళతాడు. ఓ టైమ్ లో బిచ్చగాళ్ల నుంచి ఆహారం కూడా దొంగలిస్తాడు. అసలు ఎందుకలా మారాడు? చివరకు ఏమైందనేది సినిమా?

ట్రైలర్ లో హీరోను పూర్తిగా నాటుగా చూపించారు డైరెక్టర్ యశస్వి. మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ లో దీపక్ సరోజ్ అద్భుతంగా నటించారు. హీరోయిన్ తన్వి నేగి కథానాయికగా బాగానే నటించింది. ఎమోషన్ సీన్లలో ఆకట్టుకుంది. రాధన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అట్రాక్ట్ చేస్తోంది. మొత్తంగా అర్జున్ రెడ్డి సినిమాలా అనిపిస్తోంది ట్రైలర్.

శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో వస్తున్న తొలి సినిమా ఇది. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు.