సిద్ధు పాత సినిమాను మళ్ళీ ఇలా..
ఇక సినిమా పేరు కూడా మార్చేశారు. ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.
By: Tupaki Desk | 3 Feb 2025 7:23 AM GMT‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఇమేజ్ ని అమాంతం పెంచేసాయి. ఒక్కసారిగా సిద్దుకి యూత్ ఫాలోయింగ్ కూడా ఈ చిత్రాలతో పెరిగిపోయింది. వీటి కంటే ముందు సిద్దు రొమాంటిక్ ఎంటెర్టైనెర్స్ చేశాడు. వాటిలో ఒకటి ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ఈ మూవీ కరోనా లాక్ డౌన్ టైంలో డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది.
ఈ సినిమాకి ఓటీటీలో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కరోనా సమయంలో రిలీజ్ కావడంతో ఎక్కువ యూత్ కి రీచ్ కాలేదు. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో సిద్దుకి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి హీరోయిన్స్ గా నటించారు. అయితే ప్రస్తుతం సిద్దుకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.
ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే స్పెషల్ గా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. రానా సమర్పణలో ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మూవీ ప్రమోషన్స్ ని కూడా రానా దగ్గరుండి చూసుకుంటున్నారు. యూత్ ఆడియన్స్ కి ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక సినిమా పేరు కూడా మార్చేశారు. ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు.
ఈ కొత్త టైటిల్ తో న్యూ రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతోంది. ఫిబ్రవరి 14న విశ్వక్ సేన్ ‘లైలా’, కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే స్పేస్ ని ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ భర్తీ చేస్తుందని అనుకుంటున్నారు.
మరోవైపు రామ్ చరణ్ ‘ఆరెంజ్’ సినిమాని మరోసారి రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే ‘ఆరెంజ్’ కంటే సిద్దు సినిమాకి ఎక్కువ ఆదరణ రావొచ్చని అనుకుంటున్నారు. ఓటీటీలో ఈ చిత్రాన్ని చాలా మంది చూడలేదు. చూసిన వాళ్ళు కూడా బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం థియేటర్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. మరి రానా ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.