Begin typing your search above and press return to search.

జానీ మాస్టర్ స్టెప్పులతో స్టార్ బాయ్.. సాంగ్ చూశారా?

ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా ఉండబోతున్న ఈ సినిమా టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

By:  Tupaki Desk   |   7 March 2025 6:28 PM IST
జానీ మాస్టర్ స్టెప్పులతో స్టార్ బాయ్.. సాంగ్ చూశారా?
X

టాలీవుడ్‌లో వెరైటీ కంటెంట్‌తో ఆకట్టుకునే హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. ‘డీజే టిల్లు’తో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్న ఈ యువ హీరో ఇప్పుడు మరో మాస్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జాక్ - కొంచెం క్రాక్’ మూవీ ఇప్పటికే మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీగా ఉండబోతున్న ఈ సినిమా టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు, మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేస్తూ ఫస్ట్ సింగిల్ ‘పాబ్లో నెరుడా’ విడుదల చేశారు. పాట టైటిల్ వినగానే హీరో క్యారెక్టర్ లో ఆసక్తి పెరిగిపోయింది. పొయెట్ పాబ్లో నెరుడా పేరు ఉపయోగించి మాస్ ఎంటర్‌టైనర్‌కు సాంగ్ తీయడం విభిన్నమైన కాన్సెప్ట్. వనమాలి అందించిన లిరిక్స్ ఆకట్టుకునేలా ఉండగా, అచ్చు రాజమణి మ్యూజిక్ క్యాచీ ట్యూన్‌ను అందించింది.

ముఖ్యంగా, బెన్నీ దయాల్ ఎనర్జిటిక్ వాయిస్ పాటను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. ఇకపోతే, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో సిద్ధు స్టెప్స్ చూసిన అభిమానులు ఆయనను మాస్ డాన్సర్ అని పిలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పాటలో సిద్ధు లుక్ చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారు. సాధారణంగా ఆయన సినిమాల్లో ట్రెండీ కాస్ట్యూమ్స్ ఉంటాయి. కానీ ‘జాక్’లో మాస్ మసాలా ఎలిమెంట్స్ బాగా మిక్స్ చేయడంతో, లుక్ కూడా దానికి తగ్గట్టుగానే మారింది.

కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్, స్టైలిష్ కాస్ట్యూమ్స్, హుషారైన డ్యాన్స్ మూమెంట్స్ కలిపి ఈ పాటను మరింత హైలైట్ చేసేశాయి. సిద్ధు అభిమానులు కూడా ఈ పాటను ‘జాక్’ మూవీకి మూడ్ సెటప్ చేసే సాంగ్‌గా అభివర్ణిస్తున్నారు. సిద్ధు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఈ సినిమాలో ఓ కొత్త యాంగిల్‌లో కనిపించబోతుందట.

బేబీ సినిమాతో ఆకట్టుకున్న వైష్ణవి, ఈ సినిమాలో మరింత గ్లామరస్‌గా కనిపించనున్నట్లు సమాచారం. టీజర్‌లో కనిపించిన ఆమె లుక్స్ కూడా ఇదే విషయాన్ని హింట్ ఇస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తిగా ఫన్ రైడ్ కానుందని చిత్రబృందం తెలిపింది.