జాక్ ని ఢీ కొడుతున్న యాంకర్ కమ్ హీరో..!
ఇదిలా ఉంటే ఏప్రిల్ 10న జాక్ వస్తుంటే ఏప్రిల్ 11న ప్రదీప్ మాచిరాజు సినిమా రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు.
By: Tupaki Desk | 17 March 2025 8:45 AM ISTసమ్మర్ కి సినిమాల సందడి మొదలు కాబోతుంది. మార్చి నెల ఆఖరి నుంచే వరుస సినిమాల రిలీజ్ లు ఉన్నాయి. ఇక ఏప్రిల్ లో కూడా మంచి రిలీజ్ డేట్ లు లాక్ చేసుకున్న సినిమాలు ఉన్నాయి. అందులో టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమా కూడా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జాక్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవీ చైతన్య ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది. జాక్ సినిమా నుంచి ఈమధ్యనే ఒక సాంగ్ రిలీజ్ కాగా ఆడియన్స్ ని మెప్పించింది.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 10న జాక్ వస్తుంటే ఏప్రిల్ 11న ప్రదీప్ మాచిరాజు సినిమా రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. ప్రదీప్ హీరోగా వస్తున్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ లాక్ చేసుకున్నారు. ఈ సినిమాను నితిన్ & భరత్ డైరెక్ట్ చేస్తున్నారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రదీప్ మాచిరాజు సరసన దీపిక పిల్లి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రూరల్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.
ఐతే జాక్ తో పోటీ పడుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. జాక్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలు వేరు వేరు జోనర్లలో వస్తున్నాయి. రెండు కూడా వెంట వెంట రిలీజ్ లు అవుతున్నాయి. రెండు సినిమాలు బాగుంటే ఎవరికీ నష్టం ఉండదు. కానీ ఒక సినిమా బాగుండి మరోటి బాగాలేకపోతే మాత్రం ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. ప్రదీప్ మాచిరాజు హీరోగా చేసిన తొలి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సక్సెస్ అందుకోగా రెండో సినిమాను కూడా అదే రేంజ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
జాక్ తో సిద్ధు కూడా మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. అఖిల్ తో బ్యాచిలర్ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ చేస్తున్న సినిమాగా జాక్ మీద మంచి హోప్స్ ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో ఏది ఆడియన్స్ ని మెప్పించి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. జాక్ వర్సెస్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఆడియన్స్ కు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అందిస్తాయన్నది చూడాలి. ఐతే రెండు సినిమాల మీద మేకర్స్ కి మంచి కాన్ఫిడెన్స్ ఉందని తెలుస్తుంది.