Begin typing your search above and press return to search.

ఏంటీ జాక్.. ప్రభాస్ రాడనే ధైర్యమా?

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘జాక్’ ప్రపంచవ్యాప్తంగా 2025 ఏప్రిల్ 1 విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

By:  Tupaki Desk   |   18 Dec 2024 6:17 AM GMT
ఏంటీ జాక్.. ప్రభాస్ రాడనే ధైర్యమా?
X

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘జాక్’ ప్రపంచవ్యాప్తంగా 2025 ఏప్రిల్ 1 విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సిద్ధు కెరీర్‌కి మరో యూ టర్న్ కానున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ టాలీవుడ్ వర్గాల్లో మరో ఆసక్తికర చర్చకు తెరలేపింది.

ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ ‘రాజా సాబ్’ మూవీ కూడా అదే రోజున అంటే ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇటీవల రాజా సాబ్ సినిమా పనులు ఇంకా పూర్తికాలేదని, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ గాసిప్ ఆధారంగా సిద్ధు జొన్నలగడ్డ మేకర్స్ ధైర్యంగా ఏప్రిల్ 10న విడుదల తేదీని అనౌన్స్ చేశారా? అనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి.

ప్రభాస్ సినిమాలు అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. ప్రస్తుతం ‘రాజా సాబ్’ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది కానీ, హారర్ కామెడీ జోనర్‌లో విభిన్నమైన విజువల్స్ అవసరమవుతాయి. వీటి వర్క్ కోసం మరింత సమయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అదే నిజమైతే రాజా సాబ్ మేకర్స్ ఈ డేట్‌ని వాయిదా వేసే అవకాశముంది. అందుకే ‘జాక్’ మేకర్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏప్రిల్ 10 అని ప్రకటించినట్లుగా తెలుస్తోంది.

సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన నటిస్తున్న ‘జాక్’ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ చిత్రం యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతుండగా, సిద్ధు మాస్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. బొమ్మరిల్లు బాస్కర్, ఎమోషన్స్ తోనే తనదైన శైలితో సక్సెస్ కొట్టిన డైరెక్టర్. అయితే ఇప్పుడు ఆయన మాస్ జోనర్‌లోకి అడుగుపెట్టడం ‘జాక్’ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. ఇదేదో కొత్తగా ఉంటుందనే క్యూరియసిటీ క్రియేట్ అవుతోంది.

ఒకవేళ ‘రాజా సాబ్’ కూడా ఏప్రిల్ 10న వస్తే టాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద భారీ క్లాష్ అనివార్యమవుతుంది. సిద్ధు జొన్నలగడ్డ సినిమాలకి యూత్ లో క్రేజ్ ఉన్నా, ప్రభాస్ తో పోటీ అంటే అస్సలు రిస్క్ చేయకపోవచ్చు. ఇప్పటికి అధికారిక ప్రకటన రాలేకపోయినా, ప్రభాస్ అభిమానులు మాత్రం ‘రాజా సాబ్’ ఎలాంటి డిలే లేకుండా అనుకున్న టైమ్‌కే విడుదల కావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో టాలీవుడ్ వర్గాలు మాత్రం ప్రభాస్ సినిమా వాయిదా పడితే, సిద్ధు ‘జాక్’ కు బాగా కలిసొస్తుందని చెబుతున్నాయి. ఒకవేళ ‘రాజా సాబ్’ వాయిదా పడితే ఏప్రిల్ 10 డేట్ మీద ‘జాక్’ బాగానే బజ్ క్రియేట్ చేసుకోవచ్చు.

ఈ రెండు సినిమాల డేట్‌పై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ‘రాజా సాబ్’ వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటిస్తే ‘జాక్’ మేకర్స్ మరింత ధైర్యంగా ప్రమోషన్ హడావుడి మొదలు పెట్టే అవకాశం ఉంది. కానీ అదే డేట్‌కి ప్రభాస్ సినిమా కూడా విడుదలైతే, సిద్ధు జొన్నలగడ్డ కెరీర్‌లో ఇది పెద్ద సవాల్‌గా మారనుంది. ఏది ఏమైనా, ఏప్రిల్ 10కి నిజంగా ఎవరు వస్తారో.. టాలీవుడ్‌లో బిగ్ రేస్ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.