సిద్ధుకి 'జాక్'పాట్ తగిలేనా..?
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాడు యువ హీరో స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ.
By: Tupaki Desk | 25 Dec 2024 4:30 PM GMTడీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాడు యువ హీరో స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం అతను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమాలో సిద్ధు సరసన బేబీ వైష్ణవి చైతన్య నటిస్తుంది. బేబీ హిట్ తర్వాత ఆశిష్ రెడ్డితో ఒక సినిమా చేసిన వైష్ణవి చైతన్య ఆ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. ఐతే సిద్ధు జాక్ మీద ఆమె హోప్స్ పెట్టుకుంది.
సిద్ధు జాక్ సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్ కూడా తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తీసిన భాస్కర్ ఆ సినిమా తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తీసుకున్నాడు. సిద్ధు ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా సూపర్ స్టోరీతో జాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు కొల్లగొట్టిన సిద్ధు జాక్ తో మరోసారి ఆ టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకే సినిమా విషయంలో ప్రతి యాస్పెక్ట్ చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తున్నారు.
సిద్ధు కేవలం హీరోగానే కాకుండా స్క్రిప్ట్ లో కూడా తన ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తాడు. భాస్కర్ జాక్ సినిమాకు కూడా తన నుంచి సినిమాకు ఉపయోగపడేలా సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. జాక్ సినిమా విషయంలో సిద్ధు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఐతే ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేశారు. అసలైతే ఆ డేట్ ని రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ కోసం ఫిక్స్ చేశారు. ఐతే రాజా సాబ్ సినిమా దాదాపు వాయిదా పడుతుందని సోర్స్ రావడం వల్లే సిద్ధు జాక్ ని ఆ డేట్ కి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ గా ఉంటాయి. సిద్ధు, వైష్ణవి మధ్య సీన్స్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయని తెలుస్తుంది. జాక్ తో సిద్ధు మరో సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అదే జరిగితే మాత్రం సినిమాతో సిద్ధు రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సిద్ధు నెక్స్ట్ సినిమా కూడా తెలుసు కదా అంటూ రాబోతుంది. ఆ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేస్తున్నారు. కె.జి.ఎఫ్ శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ఆ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు.