Begin typing your search above and press return to search.

స్టైలిస్ట్ చెక్కిన శిల్పంలా సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ

తాజాగా మేకర్స్ మహారాష్ట్రలో 24 రోజుల లాంగ్ షెడ్యూల్‌ ప్రారభించారు. సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి పై చిత్రీకరిస్తున్న సాంగ్ తో ఈ షెడ్యూల్‌ మొదలైంది.

By:  Tupaki Desk   |   17 Nov 2024 1:51 PM GMT
స్టైలిస్ట్ చెక్కిన శిల్పంలా సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ
X

స్టార్ బోయ్ సిద్దు జొన్నలగడ్డ డీజే ఫ్రాంఛైజీతో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుని ఇప్పుడు `తెలుసు కదా` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో అత‌డిని పూర్తిగా బెస్ట్ స్టైలిష్ అవతార్‌లో కనిపించనున్నారని చిత్ర‌బృందం చెబుతోంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా మేకర్స్ మహారాష్ట్రలో 24 రోజుల లాంగ్ షెడ్యూల్‌ ప్రారభించారు. సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి పై చిత్రీకరిస్తున్న సాంగ్ తో ఈ షెడ్యూల్‌ మొదలైంది. ఈ షెడ్యూల్‌ లో సాంగ్ తో పాటు కీల‌క‌మైన‌ టాకీ పార్ట్ ని షూట్ చేయనున్నారు. లీడ్ యాక్టర్స్ తో పాటు సినిమాలోని కీలక నటీనటులు పాల్గొంటున్నారు. డీజేలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ స్టైల్, లుక్, అవ‌తార్ ప్ర‌తిదీ ఆడియెన్ ని మెస్మ‌రైజ్ చేసాయి. ఇప్పుడు అందుకు భిన్నంగా ..స‌రికొత్త‌ స్టైలిష్ అవ‌తార్ లో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌ను ఎలివేట్ చేసేందుకు నీర‌జ కోన ప్ర‌య‌త్నిస్తున్నారని స‌మాచారం.

హై బడ్జెట్‌, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ థమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. జ్ఞాన శేఖర్ బాబా డీవోపీ కాగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొఫెషనల్ నవీన్ నూలి ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ.