యంగ్ హీరో కోసం గీతగోవిందం!
`డీజేటిల్లు`..`టిల్లు స్వ్కేర్` తో సిద్దు జొన్నలగడ్డ ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాడో? తెలిసిందే.
By: Tupaki Desk | 19 Oct 2024 3:30 PM GMT`డీజేటిల్లు`..`టిల్లు స్వ్కేర్` తో సిద్దు జొన్నలగడ్డ ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాడో? తెలిసిందే. ఈ రెండు విజయాలతో స్టార్ హీరోలు సైతం అతడిని ప్రశంసిస్తున్నారు. అతడితో దోస్తీ చేస్తున్నారు. అంతగా ఆ సినిమాలకు ఆ హీరోలంతా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ...సిద్దూని ఎంతగానో అభిమానిస్తాడు. ప్రస్తుతం జొన్నలగడ్డతో సినిమాలు తీయడానికి దర్శకులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సిద్దు చేతిలో కొన్ని సినిమాలున్నాయి.
`జాక్`, ` తెలుసు కదా` అనే సినిమాలు చేస్తున్నాడు. ఇవి సెట్స్ లో ఉన్నాయి. ఇవి కాక `కోహినూర్`, `టిల్లు క్యూబ్` సినిమాలు కూడా పూర్తి చేయాలి. సిద్దు కేవలం నటుడు మాత్రమే కాదు. అంతకు మించి గొప్ప రైటర్ కూడా. తనలో ఈ యూనిక్ క్వాలిటీ కూడా అతడి కెరీర్ కి ఎంతగానో కలిసొచ్చింది. తనని తానే స్టార్ గా మలుచుకోవడంలో ఆ క్వాలిటీనే కీలక పాత్ర పోషించిందన్నది వాస్తవం.
ఈ నేపథ్యంలో తాజాగా సిద్దుతో సినిమా చేయడానికి `గీతగోవిందం` దర్శకుడు పరశురాం కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరి మధ్యా స్టోరీ డిస్కషన్ కూడా జరిగిందని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాలని ఆసక్తిగా ఉన్నారుట. మరికొన్ని రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది. `సర్కారు వారి పాట` తర్వాత పరశురాం ఇంత వరకూ కొత్త సినిమా పట్టాలెక్కించలేదు. స్టార్ హీరోలంతా బిజీగా ఉన్నారు.
టైర్ 2 హీరోలు కూడా అంతే బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో హీరోలు డేట్లు దొరకని పరిస్థితి తలెత్తింది. పరశురాం సిద్దు ఇమేజ్ కి తగ్గ స్టోరీతో అప్రోచ్ అవ్వడంతో? కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. `గీత గోవిందం` తో విజయ్ దేవరకొండ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇమేజ్ తెచ్చింది పరశురాం అన్న సంగతి తెలిసిందే.