ఇట్స్ కాంప్లికేటెడ్.. రానాకి అర్దమైన లవ్ స్టోరీ..!
సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
By: Tupaki Desk | 12 Feb 2025 2:01 PM GMTస్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రవికాంత్ పెరెపి కాంబినేషన్ లో 2020 లో వచ్చిన సినిమా కృష్ణ అండ్ హిస్ లీల. ఈ సినిమా కరోనా టైం అవ్వడం వల్ల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశారు. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని హీరోయిన్స్ గా నటించారు. రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమా వాలెంటైన్స్ డే కి స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతుంది. సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మీడియా మీట్ లో సిద్ధు రవికాంత్ తో మరో సినిమా చేయాలని ఉంది. ఐతే ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమా రిలీజ్ చేస్తే గానీ మరో సినిమా చేయమని అన్నారు.. అందుకే ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామని ఇది రీ రిలీజ్ కాదు.. థియేటర్స్ లో ఫస్ట్ రిలీజ్ అని అన్నారు రానా దగ్గుబాటి.
సినిమాను థియేటర్స్ లో ఆడియన్స్ చూడాలనేదే నా స్ట్రాంగ్ ఫీలింగ్.. అందుకే ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నామని అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. లాక్ డౌన్ టైం లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేయలేదు. అందుకే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం.. ఆడియన్స్ రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నా అన్నారు డైరెక్టర్ రవికాంత్ పెరెపు.
ఈ సినిమాకు టైటిల్ మార్చారెందుకు అన్న ప్రశ్నకు సమాధానంగా.. ముందు వేరే ఒక టైటిల్ అనుకున్నాం. కానీ ఆ టైటిల్ పెట్టడం కుదరలేదు ఆ తర్వాత ఇట్స్ కాంప్లికేటెడ్ అని డైరెక్టరే పెట్టాడు. ఈ సినిమా థియేటర్స్ లో అందరితో కలసి చూడడం అనేది వెరీ గుడ్ ఫీలింగ్. ఇది రీ రిలీజ్ కాదు. థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్ అని అన్నారు రానా.
మార్చిన టైటిల్ గురించి రవికాంత్ పెరెపు చెబుతూ.. ఇట్స్ కాంప్లికేటెడ్ అని కాలేజ్ డేస్ లో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా శాటిలైట్ రావాలంటే సెన్సార్ క్లియర్ కావాలి. అదుకే ఈ సినిమాకి ఇట్స్ కాంప్లికేటెడ్ టైటిల్ యాప్ట్ అవుతుందని అలా సినిమాకి ఈ టైటిల్ పెట్టామని అన్నారు. ఈ కథ అందరూ రిలేట్ చేసుకునేలా వుంటుందని అన్నారు రవికాంత్.
విశ్వక్ సేన్ మీకు మంచి ఫ్రెండ్ కదా.. ఆయన సినిమాతో పాటు మీ సినిమా రిలీజ్ చేయడానికి కారణం ఏంటని సిద్ధుని అడిగితే.. మా సినిమా రీ రిలీజ్, అది స్ట్రయిట్ రిలీజ్.. అసలు కంపారిజన్ లేదని అన్నారు సిద్ధు.
నాకు కొన్ని లవ్ స్టోరీస్ మాత్రమే అర్ధమవుతాయి. అందులో ఈ సినిమా ఒకటని అన్నారు రానా.. అందరిలో లైఫ్ లో కొన్ని జరుగుతాయి.. వాటిని చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారని చెప్పారు.
రానా దగ్గరకు అవుట్ అఫ్ ది బాక్స్ కథలు వస్తాయి. రానా వాటిని అర్ధం చేసుకొని ముందుకు తీసుకెళ్తారు. ఇలాంటి కథలు చేయాలంటే అందరు ధైర్యం చేయరు. రానా మాత్రం ఇలాంటి కథ చెప్పాలని అనుకుంటారు. ఈ కథ రానాకి చెబితే చాలా స్ట్రాంగ్ గా ఫీలయ్యారని అన్నారు సిద్ధు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేసుంటే సిక్స్ టైమ్స్ ఎక్కువ వచ్చేది.
ఈ సినిమా గురించి సోషల్ మీడియా ఎప్పుడూ రిక్వెస్ట్ లు వచ్చాయి.. ఒకరోజు సిద్దు దీని గురించి చెప్పాడు.. అలా క్షణాల్లో జరిగింది. వాలంటైన్ డే ఈ సినిమా రిలీజ్ కి పెర్ఫెక్ట్ టైం అని రానా చెప్పారు.
ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించడం సాధ్యమేనా ? మీ ఒపినియన్ ఏమిటని డైరెక్టర్ ని అడిగితే.. ఇది చాలా పర్సనల్ థింగ్. నా ఒపినియన్ చెప్పాలంటే సినిమాలో ఏముందో అదే అన్నారు రవికాంత్.
రానా గారు కథల ఎంపిక గురిచి చెబుతూ.. ఎందుకు ఈ కథ చెబుతున్నామనేది ముందు చూస్తానని. తర్వాత కథ ఎంత కొత్తగా వుందని చూస్తానని అన్నారు. సినిమా డిఫరెంట్ కథలు ఆడియన్స్ కి చూపించడానికి ఇష్టపడతానని రానా అన్నారు.