టిల్లు కొత్త ప్రాజెక్ట్ కోసం ఇద్దరు ముద్దుగుమ్మలు?
టిల్లు 2 సినిమా విడుదల కాకుండానే నీరజ కోన తో కలిసి సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే
By: Tupaki Desk | 29 Sep 2023 10:18 AM GMTడీజే టిల్లు సినిమా తో ఒక్కసారిగా యూత్ ఆడియన్స్ లో పాపులారిటీని సొంతం చేసుకుని ప్రస్తుతం అదే డీజే టిల్లు సినిమా సీక్వెల్ చేస్తున్న సిద్దు జొన్నలగడ్డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒక వైపు టిల్లు స్వైర్ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల టిల్లు 2 వాయిదా పడింది.
టిల్లు 2 సినిమా విడుదల కాకుండానే నీరజ కోన తో కలిసి సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమాలో హీరోయిన్స్ గా రాశి ఖన్నా మరియు శ్రీనిధి శెట్టిని ఎంపిక చేయడం జరిగింది. అతి త్వరలోనే సిద్దు తో కలిసి వారిద్దరు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించబోతున్నారు.
ఈ మధ్య కాలంలో రాశి ఖన్నా జోరు కాస్త తగ్గిందని చెప్పాలి. అయితే సిద్దు తో నటించే ఛాన్స్ రావడంతో ముద్దుగుమ్మకు కాలం కలిసి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో ముదుగ్గుమ్మ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ తర్వాత చాలా ఆఫర్లు దక్కించుకుంది. కానీ ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ సినిమా ల్లో నటిస్తోంది.
సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. అలాంటి హీరోకు జోడీగా నటించే అవకాశం రావడం ఇద్దరు ముద్దుగుమ్మలకు లక్కీ ఛాన్స్ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్స్ విషయంలో సిద్దు నుంచి లేదా నీరజ కోన నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.