Begin typing your search above and press return to search.

టిల్లు అన్న.. అలా ఆలోచిస్తే బెటర్!

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగొడ్డ.. సినిమా సినిమాకు తనలోని టాలెంట్ ను బయటకు తీసుకొస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు

By:  Tupaki Desk   |   26 April 2024 2:45 AM GMT
టిల్లు అన్న.. అలా ఆలోచిస్తే బెటర్!
X

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగొడ్డ.. సినిమా సినిమాకు తనలోని టాలెంట్ ను బయటకు తీసుకొస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్ స్టార్ట్ చేసిన సిద్ధు.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్)తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తానే రైటర్ గా మారి కృష్ణ అండ్ హిజ్ లీలాతో సూపర్ హిట్ కొట్టారు.

ఇక ఆ సినిమా నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు సిద్ధు జొన్నలగడ్డ. మా వింత గాథ వినుమా, డీజే టిల్లు.. ఇప్పుడు టిల్లు స్క్వేర్ వంటి వెరైటీ కాన్సెప్ట్స్‌‌ ‌‌తో హిట్లు సాధిస్తూ దూసుకుపోతున్నారు. టిల్లు స్క్వేర్ తో ఫస్ట్ పార్ట్ కు మించిన హిట్ ను కొట్టారు. తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో మరోసారి సినీ ప్రియులను ఓ రేంజ్ లో అలరించారు.

టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రస్తుతం ఉన్న మిడ్ రేంజ్ స్టార్స్ లో అందరి కన్నా సిద్ధుకే టాప్ ప్రొడక్షన్ బ్యానర్ల నుంచి ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయని సినీ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. వాటిలో పాన్ ఇండియా ఆఫర్లు కూడా ఉన్నాయట. అయితే విజయ్ దేవరకొండలా సిద్ధు జొన్నలగడ్డ అప్పుడే పాన్ ఇండియా వైపు వెళ్లడం కరెక్ట్ కాదని సినీ పండితులు చెబుతున్నారు.

విజయ్.. పూరీ జగన్నాథ్ లైగర్ మూవీతో పాన్ ఇండియా ప్రయోగం చేశారు. అది కాస్త భారీగా ఫెయిల్ అయింది. బాక్సాఫీస్ వద్ద మూవీ డిజాస్టర్ గా మిగిలింది. అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. దీంతో విజయ్ లా తొందరపడొద్దని సలహా ఇస్తున్నారు. కేవలం కంటెంట్ ఉన్న కథలే సెలెక్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. రైటర్ గా పలు చిత్రాల అనుభవం ఉంది కనుక.. కెరీర్ లో సరైన అడుగులు వేయాలని అంటున్నారు.

పాన్ ఇండియా రేంజ్ లో కంటెంట్ క్లిక్ అవ్వాలంటే యంగ్ హీరో అడివి శేష్ లాగా ఆలోచిస్తే బెటర్ అని సజ్జెస్ట్ చేస్తున్నారు. మరి టిల్లు అన్న ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం సిద్ధు.. బొమ్మరిల్లు భాస్కర్ తో జాక్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ సరసన బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తోంది. ఈ సినిమాతో పాటు 'తెలుసు కదా' మూవీ కూడా చేస్తున్నారు సిద్ధు.

ఈ చిత్రంతో ఫేమస్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. వీటితోపాటు టిల్లు క్యూబ్ కూడా చేయనున్నారు సిద్ధు. టిల్లుకు సూపర్ హీరో పవర్స్ వస్తే ఎలా ఉంటుందనే కోణంలో టిల్లు క్యూబ్ తెరకెక్కనుందని ఆయనే కొన్ని రోజుల క్రితం చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుందని సమాచారం.