Begin typing your search above and press return to search.

బొమ్మరిల్లు భాస్కర్.. టిల్లుతో గన్ షాక్ కాంబో

అయితే ఆ సినిమా తర్వాత అతను ఏ హీరోతో సినిమా చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఊహించని విధంగా ఒక పోస్టర్ వదిలి షాక్ అయితే ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   11 Dec 2023 1:02 PM GMT
బొమ్మరిల్లు భాస్కర్.. టిల్లుతో గన్ షాక్ కాంబో
X

బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న భాస్కర్ ఆ తర్వాత తన పేరులోనే సినిమా టైటిల్ తో పిలుచుకునే రేంజ్ కు వచ్చేసాడు. ఒక విధంగా నిర్మాత దిల్ రాజుకు తన కెరీర్ మొత్తంలో పెట్టిన పెట్టుబడికి కూడా అత్యధిక స్థాయిలో మంచి లాభాలను అందించిన సినిమాల్లో అది ఒకటి. అయితే భాస్కర్ ఆ తర్వాత పరుగు సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నాడు.


ఇక అతను కూడా స్టార్ దర్శకులతో చేరిపోతాడు అని అనుకుంటున్నా సమయంలో ఊహించని విధంగా ఆరెంజ్ తో మాత్రం డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా విడుదలైనప్పుడు కమర్షియల్ గా దెబ్బకొట్టినప్పటికీ కంటెంట్ పరంగా మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆ కంటెంట్కు మాత్రం మంచి గుర్తింపు అందుతుంది.

ఆరెంజ్ రీ రిలీజ్ లో సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. అయితే ఆరంజ్ సినిమా తర్వాత రామ్ తో చేసిన ఒంగోలు గిత్త కూడా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అనంతరం 2017లో అతను తమిళంలోనే ఒక సినిమా చేశాడు. అది కూడా డిజాస్టర్ అయింది. ఇక మళ్ళీ అతను సినిమాలు చేయడేమో అని అందరూ అనుకున్న తరుణంలో ఎక్కువగా అల్లు అరవింద్ కాంపౌండ్ లో వర్క్ చేసుకుంటూ వచ్చాడు.

మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. అఖిల్ అక్కినేనికి కూడా ఆ సినిమా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత అతను ఏ హీరోతో సినిమా చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఊహించని విధంగా ఒక పోస్టర్ వదిలి షాక్ అయితే ఇచ్చాడు. డీజే టిల్లు సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డతో భాస్కర్ తన తదుపరి సినిమా చేయబోతున్నాడు.

ఇక ఆ సినిమాను SVCC ప్రొడక్షన్ లో BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇంతకుముందు భాస్కర్ ఒంగోలు గిత్త సినిమాను ఈ నిర్మాతతోనే చేశాడు. అయితే అఫీషియల్ గా షూటింగ్ స్టార్ట్ అంటూ ఒక ప్రత్యేకమైన పోస్టర్ విడుదల చేశారు. అందులో హీరో సిద్దు చాలా నార్మల్ గా ఉండగా నిర్మాత అమాయకంగా కనిపిస్తున్నారు. కానీ దర్శకుడు భాస్కర్ మాత్రం గన్ షాట్ తో యాక్షన్ డోస్ ఇస్తున్నాడు. చూస్తుంటే భాస్కర్ ఈ సారి ఏదైనా యాక్షన్ కథను టచ్ చేస్తాడా అని అనిపిస్తుంది. మొత్తానికి పోస్టర్ తో అయితే కొంత ఆసక్తిని క్రియేట్ చేశారు. చూడాలి మరో భాస్కర్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో.