రానా వెళ్లే గ్యాదరింగ్స్ లో శ్రీలీల.. సిద్ధుతో సందడి!
ఇప్పుడు రెండో ఎపిసోడ్ కు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, యంగ్ హీరోయిన్ శ్రీలీల గెస్టులుగా వచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 30 Nov 2024 7:43 AM GMTటాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న లేటెస్ట్ టాక్ షో 'ది రానా దగ్గుబాటి షో'. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఆ షోను భారీగా ప్లాన్ చేసిందనే చెప్పాలి. తొలి ఎపిసోడ్ ను రీసెంట్ గా గోవాలో జరిగిన ప్రతిష్టాత్మకమైన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా- IFFI ఈవెంట్ లో స్క్రీనింగ్ చేశారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ స్క్రిప్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఆ షో ఫస్ట్ ఎపిసోడ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది. మొదటి ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో తేజ సజ్జా, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ సందడి చేశారు.
ఇప్పుడు రెండో ఎపిసోడ్ కు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, యంగ్ హీరోయిన్ శ్రీలీల గెస్టులుగా వచ్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే అలరించగా.. నిర్వాహకులు తాజాగా ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు. సిద్ధు, రానా.. శ్రీలీలను సరదాగా టీజ్ చేశారు. ముగ్గురూ కలిసి సందడి చేశారు.
ఎపిసోడ్ లో భాగంగా శ్రీలీల అప్ కమింగ్ ప్రాజెక్టుల కోసం అంతా మాట్లాడారు. ఆ సమయంలో ఆమె బాలీవుడ్ డెబ్యూ కోసం రానా, సిద్ధూ అడిగారు. కానీ శ్రీలీల ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కనుక ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదేమో. కానీ నటిస్తున్నట్లు మాత్రం తెలిపారు.
బాలీవుడ్ లో ఫస్ట్ టైమ్ నటిస్తున్నట్లు శ్రీలీల చెప్పారు. అదొక కొత్త అనుభూతి అని తెలిపారు. దీంతో త్వరలోనే శ్రీలీల బీటౌన్ డెబ్యూ మూవీ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తాను హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తరచుగా హాజరు కావడం గురించి రానా ప్రస్తావించగా.. యంగ్ బ్యూటీ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
'నేను వెళ్ళే ప్రతి పెళ్ళిలో నిన్ను, మీ అమ్మని చూస్తుంటాను, నా కజిన్స్ నిన్ను వాళ్ళ చెల్లి అని పిలవడం విన్నాను.. అసలేం జరుగుతోంది' అని రానా అనగా.. తాము మీ (రానా) స్వస్థలమైన కారంచేడుకు దగ్గరగా ఉన్న ఒంగోలు నుంచి వచ్చామని, సంక్రాంతికి తరచుగా వెళ్తుంటామని చెప్పారు శ్రీలీల.
ప్రస్తుతం రానా దగ్గుబాటి షో సెకండ్ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. మంచి రెస్పాన్స్ అందుకుని అలరిస్తోంది. ఫుల్ ఫన్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ముగ్గురూ ఓ రేంజ్ లో సందడి చేశారని చెబుతున్నారు. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్ అని అంటున్నారు. ఎనిమిది ఎపిసోడ్ ల షోలో భాగంగా దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య, రాజమౌళి తదితరులు గెస్టులు గా రానున్నారు.