Begin typing your search above and press return to search.

చిరు, సల్మాన్‌... ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ!

సిద్దు జొన్నలగడ్డ ఉన్న విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు క్యాష్ చేసుకోవాలి అనుకోలేదు.

By:  Tupaki Desk   |   16 Aug 2024 6:02 AM GMT
చిరు, సల్మాన్‌... ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ!
X

కమర్షియల్‌ సినిమాల్లో గెస్ట్‌ అప్పియరెన్స్ లకు మంచి స్పందన వస్తూ ఉంటుంది. అలాంటిది ఒక స్టార్‌ హీరో సినిమాలో మరో హీరో అది కూడా క్రేజీ స్టార్‌ ఉంటే ఆ సినిమా గురించి ఎంతటి ప్రచారం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో సినిమా విడుదలకు ముందు నుంచే గెస్ట్‌ అప్పియరెన్స్ గురించి ప్రముఖంగా చర్చ జరగడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ గెస్ట్‌ అప్పియరెన్స్ గురించిన చర్చ ఎందుకు అంటారా.. అసలు విషయం ఏంటంటే నిన్న విడుదల అయిన రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో డీజే టిల్లు ఫేం సిద్దు జొన్నలగడ్డ గెస్ట్‌ గా కనిపించాడు.

సిద్దు జొన్నలగడ్డ ఉన్న విషయాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు క్యాష్ చేసుకోవాలి అనుకోలేదు. అందుకే ప్రచారంలో ఎక్కడ కూడా టిల్లు గాడి సందడి మా బచ్చన్ తో ఉంటుంది అనే విషయాన్ని చెప్పలేదు. అందుకే సినిమాలో సిద్దు జొన్నలగడ్డను చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు. అనుకోని అతిథి అంటూ సోషల్‌ మీడియాలో మిస్టర్ బచ్చన్ గురించి మరింతగా ప్రచారం జరిగింది. హీరోల ఫ్యామిలీ కష్టంలో ఉన్న సమయంలో ఇలా గెస్ట్‌ హీరోలు వచ్చి సేవ్‌ చేయడం గతంలో టాలీవుడ్‌ సినిమాల్లో చాలా సార్లు చూశాం. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ ఆ గెస్ట్‌ హీరో స్థానం దక్కించుకున్నాడు.

రామ్‌ చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీ సినిమాలో చరణ్‌ ఫ్యామిలీ కష్టంలో ఉన్నప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి రంగంలోకి దిగి సాయం చేయడంను చూపించారు, ఇక చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌ సినిమాలో కూడా సల్మాన్ ఖాన్‌ వచ్చి సహాయం చేయడం మనం చూస్తూ ఉంటాం. మిస్టర్ బచ్చన్‌ లో రవితేజ ఫ్యామిలీ ఆపదలో ఉన్న సమయంలో సీరియస్ గా కాకుండా తనదైన శైలిలో సిద్దు జొన్నలగడ్డ ఎంట్రీ ఇచ్చి కాపాడటం అందరినీ ఆకట్టుకుంది. సిద్దు జొన్నలగడ్డ ఎంట్రీ వల్ల సినిమా స్థాయి మరింత పెరిగిందనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ తో ఉన్న సన్నిహిత సంబంధం తో పాటు హరీష్ శంకర్ తో సిద్దు జొన్నలగడ్డకి ఉన్న స్నేహం కారణంగా ఈ క్యామియో చేసినట్లు సమాచారం అందుతోంది. ముందు ముందు రవితేజ మరియు సిద్దు జొన్నలగడ్డ కలిసి ఫుల్‌ లెంగ్త్‌ సినిమా చేయాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఇక క్యామియో కారణంగా భవిష్యత్తులో హరీష్ శంకర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి సిద్దు జొన్నలగడ్డ క్యామియో రోల్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.