Begin typing your search above and press return to search.

టిల్లు గాడి ఈ విషయాలు తెలుసు కదా...!

సిద్దు జొన్నలగడ్డ తో నీరజ కోన రూపొందిస్తున్న 'తెలుగు కదా' సినిమా పై అంచనాలు పెరుగుతూ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   20 July 2024 7:28 AM GMT
టిల్లు గాడి ఈ విషయాలు తెలుసు కదా...!
X

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. అందులో నీరజ కోన దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకటి అనే విషయం తెల్సిందే.

సిద్దు జొన్నలగడ్డ తో నీరజ కోన రూపొందిస్తున్న 'తెలుగు కదా' సినిమా పై అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటీవలే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ విడుదలతో అంచనాలు పెరిగాయి. సిద్దు లుక్‌ వైరల్‌ అవ్వడంతో ఆసక్తికర చర్చ జరిగింది.

ఈ సినిమాలో సిద్దుకు జోడీగా రాశి ఖన్నా మరియు శ్రీనిధి శెట్టి లు హీరోయిన్స్‌ గా నటిస్తున్నట్లుగా మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. తెలుసు కదా అనే విభిన్నమైన టైటిల్‌ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మేకర్స్‌ హీరోయిన్‌ ఎంపికతో మరింతగా సినిమాకు క్రేజ్ పెంచారు.

కేజీఎఫ్‌ తో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో నటించడం ద్వారా కచ్చితంగా బజ్ మరింతగా పెరగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక రాశి ఖన్నా కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.

వైవా హర్ష ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక రెగ్యులర్‌ కమర్షియల్ లవ్ స్టోరీ కాదని, స్నేహం, కుటుంబ విలువలు చూపించే విధంగా ఉంటుందని, ఒక మంచి ఫ్యామిలీ మూవీ అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.