ఇది కాస్త రిస్కేమో టిల్లు
డీజే టిల్లుకి సీక్వెల్ గా సిద్ధమైన టిల్లు స్క్వేర్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని సిద్దు జొన్నలగడ్డ గట్టి ప్రయత్నం చేస్తున్నారు
By: Tupaki Desk | 25 March 2024 8:42 AM GMTడీజే టిల్లుకి సీక్వెల్ గా సిద్ధమైన టిల్లు స్క్వేర్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని సిద్దు జొన్నలగడ్డ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. డీజే టిల్లు చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. రాధిక క్యారెక్టర్ తో టిల్లు పండించిన వినోదానికి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.
అయితే ఈ సారి రాధిక ప్లేస్ లోకి లిల్లీని సిద్దు తీసుకొచ్చాడు. లిల్లీగా అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ అండ్ రొమాంటిక్ ఇంటిమెంట్ సన్నివేశాలతో దర్శనం ఇవ్వబోతోంది. ఆమె ఇలాంటి పాత్ర చేయడంతో టిల్లు స్క్వేర్ సినిమాకు కావల్సినంత బజ్ క్రియేట్ అవుతోంది. కంప్లీట్ గా యూత్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని రెడీ చేసినట్లు టీజర్ లో ఉన్న సన్నివేశాల బట్టి అర్ధమవుతోంది. రొమాంటిక్ కామెడీకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది.
అందుకే డీజే టిల్లులో లేని మసాలాని టిల్లు స్క్వేర్ లో అదనంగా యాడ్ చేశారు. అనుపమ పరమేశ్వరన్ కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా సిద్దుతో ఇంటిమెంట్ సన్నివేశాలు చేసింది. ఆమె క్యారెక్టర్ రాధికని మించి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ ఓవర్ మసాలా సన్నివేశాలు టిల్లు స్క్వేర్ కి మైనస్ అవుతాయేమో అనే అనుమానం కూడా కలుగుతోంది.
ఇప్పుడు మూవీ రన్ టైం కూడా రిస్క్ ఫ్యాక్టర్ ని మరింత పెంచేలా ఉందనే మాట వినిపిస్తోంది. మూవీ 2 గంటల కంటే తక్కువ నిడివి మాత్రమే ఉంటుందంట. ఈ సినిమా రన్ టైంపై కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి కథని అందించింది సిద్దునే కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులకి ఏం కావాలి. ఏ స్థాయిలో ఇవ్వాలనే దానిపై ఒక స్పష్టత ఉండొచ్చని అనుకుంటున్నారు.
కాబట్టి అవసరమైన మేరకు 1 గంట 58 నిమిషాల నిడివితో సినిమా అవుట్ ఫుట్ రెడీ అయినట్లు టాక్. పర్ఫెక్ట్ సీన్స్ తో లెక్కల ప్రకారమే డీజే టిల్లులో మిస్ అయిన రొమాంటిక్ మసాలా సన్నివేశాలు టిల్లు స్క్వేర్ లో పెట్టారు. ఇవి సినిమాకి అవే అదనపు అస్సెట్ అవుతాయని భావిస్తున్నారు. వారి అంచనాలకి తగ్గట్లుగా రన్ టైం కానీ, రొమాంటిక్ సన్నివేశాలు కానీ సినిమాలు ప్లస్ అయితే ఒకే, లేదంటే సిద్దు పెద్ద రిస్క్ తీసుకున్నట్లు అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఈసారి సిద్దు ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందో.