Begin typing your search above and press return to search.

స్టార్ బోయ్ సొంత కథల వెనుక రీజన్ అదేనా..?

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో క్రేజ్ తెచ్చుకోవడం చాలా పెద్ద విషయమని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   26 March 2024 4:36 AM GMT
స్టార్ బోయ్ సొంత కథల వెనుక రీజన్ అదేనా..?
X

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో క్రేజ్ తెచ్చుకోవడం చాలా పెద్ద విషయమని చెప్పొచ్చు. సినీ నేపథ్యం ఉండి అవకాశాలు తెచ్చుకోవడం అంత టఫ్ జాబ్ కాదు కానీ అసలు ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఎంటర్ అయ్యి తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడంలోనే అసలైన విజయం ఉంటుంది. స్వయంకృషితో పైకెదిగిన స్టార్స్ గురించి చెబితే అందులో మొట్ట మొదటిగా మెగాస్టార్ చిరంజీవి వస్తారు. ఆయన వేసిన బాటలోనే సినీ పరిశ్రమలో తమకంటూ కొన్ని పేజీలు ఉండేలా చేసుకునేందుకు ముందుకొస్తున్నారు.

ఈ తరం యువ హీరోలకు కూడా చిరంజీవి స్పూర్తిగా నిలిచారని చెప్పొచ్చు. చిరంజీవి తర్వాత రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ ఇలా పరిశ్రమలోకి అడుగు పెట్టి తమ సత్తా చాటుతున్నారు. ఇదే లిస్ట్ లో తన పేరుని కూడా చేర్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. పుష్కర కాలం నుంచి సినిమాలు చేస్తున్నా అతను చేసిన డీజే టిల్లుతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ గురించి యూత్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీజే టిల్లు హిట్ మేనియా కొనసాగించేందుకు టిల్లు స్క్వేర్ వస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా లో చాలా యాస్పెక్ట్స్ ఉన్నాయని ట్రైలర్ లో అవేవి చూపించలేదని అన్నారు. ఇక కెరీర్ మొదట్లో తన దగ్గరకు మంచి కథలు వచ్చేవి కాదని అందుకే సొంతంగా ఒక టీం ని ఏర్పరచుకుని కథలు రాయడం మొదలు పెట్టానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ.

యువ హీరో అని కావొచ్చు.. లేదా మంచి కథ ఇతనికి పడితే ఎలా అనే స్వార్ధం కావొచ్చు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని లేదు. అందుకే ఆ అవకాశాన్ని ఎవరో ఇవ్వడం ఎందుకు మనమే కల్పించుకుందామని సిద్ధు ఫిక్స్ అయ్యాడు. సొంతంగా కథలు, క్యారెక్టరైజేషన్ లు రాయడం మొదలు పెట్టి డీజే టిల్లు తో స్టార్ బోయ్ సిద్ధుగా మారిపోయాడు. టిల్లు స్క్వేర్ కూడా అనుకున్న టార్గెట్ రీచ్ అయితే సిద్ధుకి తిరిగు ఉండదని చెప్పొచ్చు. యూత్ లో టిల్లు స్క్వేర్ క్రేజ్ చూస్తుంటే ఏమాత్రం బాగున్నా ఈ సినిమా సెన్సేషన్ సృష్టించేలా ఉందని చెప్పొచ్చు. మరి టిల్లు స్క్వేర్ ఫలితం ఏంటన్నది తెలియాలంటే మరో 3 రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది.