కియారా కి సీ డైవ్ అంటే భయమేస్తోందా!
కియారా చేయి పైకెత్తి సముద్రంలో ఏ భాగం లోకి దూకాలి అని ఆలోచిస్తుండగా...సిద్దార్ద్ ఆమె వైపు చూస్తూ ఎందుకు ఆలోచిస్తున్నావ్..కమాన్ దూకు!
By: Tupaki Desk | 1 Aug 2023 6:00 AM GMTవృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సిద్దార్ద్ మల్హోత్రా- కియారా అద్వాణీ దంపతులు మాత్రం వెకేషన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కారు. ఏమాత్రం సమయం దొరికినా విదేశాలకు చెక్కేసి చిలౌట్ అవుతుంటారు. విదేశీ అందాల్ని ఆస్వాదిస్తూ ఆ మూవ్ మెంట్స్ ని అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈ జోడీ వెకేషన్ మోడ్ లో ఉన్న ఓ ఫోటో ఇన్ స్టాలో కి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా ఇద్దరు సీ డైవ్ కి రెడీ అవుతున్నారు.
సిద్దార్ధ్ రెడ్ కలర్ నిక్కరు లో కనిపిస్తుండగా..కియారా బ్లాక్ అండ్ వైట్ డిజైన్ బికినీలో బ్యాక్ నుంచి ఫోకస్ అవుతుంది. కియారా చేయి పైకెత్తి సముద్రంలో ఏ భాగం లోకి దూకాలి అని ఆలోచిస్తుండగా...సిద్దార్ద్ ఆమె వైపు చూస్తూ ఎందుకు ఆలోచిస్తున్నావ్..కమాన్ దూకు! అంటూ ప్రోత్సహిస్తున్నాడు. ఈ లొకేషన్ స్పాట్ ఐలాండ్ లా ఉంది. బోట్ పై ఇద్దరు నుంచుని ఉండగా..వాళ్లకెదురుగా పెద్ద పెద్ద బండలతో కూడిన హిల్ కనిపిస్తుంది.
లొకేషన్ ఎంతో అందంగా ఉంది. ఇక ఈ సన్నివేశాన్ని ఉద్దేశిస్తే ఆసక్తికర కామెంట్లు వైరల్ అవుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ లోకి దూకినట్లు చేతులు రెండు చాచి దూకాలా? సెలయేటి లోకి దూకినట్లు కాళ్లతో ట్రై చేయాలా? అని కియారా ఆలోచిస్తుందంటూ ఓ కామెంట్ వైరల్ అవుతుంది. ఎవరైనా నిండైన బట్టలతోనే అందంగా కనిపిస్తారు. ఇలాంటి బికినీల్లో కనిపిస్తే ఆ అందానికే మచ్చ వచ్చేస్తుందంటూ మరో కామెంట్ ఇంట్రెస్టింగ్.
అలాగే ఈ జోడీ రణబీర్ కపూర్-అలియాభట్ లా ఎంతో అందంగా కనిపిస్తుందంటూ మరోకరు కామెంట్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కియారా కెరీర్ సంగతి చూస్తే అమ్మడు బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలం లో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక తెలుగులో `గేమ్ ఛేంజర్` లో రామ్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. చరణ్ తో తెరను పంచుకోవడం ఇది రెండవ సారి.