Begin typing your search above and press return to search.

సైమా 2024 అవార్డుల విజేతలు వీరే..!

సైమా (సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)2024 వేడుక దుబాయ్ లో అట్టహాసంగా జరిగింది.

By:  Tupaki Desk   |   15 Sep 2024 4:00 AM GMT
సైమా 2024 అవార్డుల విజేతలు వీరే..!
X

సైమా (సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)2024 వేడుక దుబాయ్ లో అట్టహాసంగా జరిగింది. శని.. ఆదివారాల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక దక్షిణాది భాషలకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవార్డుల ప్రకటనలు మొదలయ్యాయి. మొదటి రోజున తెలుగు.. కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించి 2023లో విశేష ప్రతిభను ప్రదర్శించిన నటీనటులకు.. మూవీ టీంలకు అవార్డుల్ని ప్రకటించారు. ఈ వేడుకల్లో హీరోయిన్లు ట్రెండీ దుస్తులతో అదరగొట్టేశారు. కార్యక్రమానికి కొత్త లుక్ ను తీసుకొచ్చారు.

అవార్డుల వేడుక సందర్భంగా పలువురు నటీమణులు తమ ప్రదర్శనల్ని ప్రదర్శించారు. ఫరియా అబ్దుల్లా.. శ్రేయ.. నేహాశెట్టి.. శాన్వీ తదితరులు తమ ప్రదర్శనలతో సైమా అవార్డుల ఫంక్షన్ మరింత ఉత్సాభరితంగా మార్చేశారు. ఇక..తెలుగు సినిమాకు సంబంధించి ఎవరెవరికి అవార్డులు వచ్చాయన్నది చూస్తే..

ఉత్తమ చిత్రంగా బాలక్రిష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి మూవీ నిలిచింది. ఉత్తమ నటుడిగా దసరా మూవీలో నటించిన హీరోనానికి అవార్డు రాగా. ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ కు అవార్డు సొంతమైంది. కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించి ‘సప్తసాగరదాచె ఎల్లో - ఎ’ మూవీలో నటించిన రక్షిత్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డు సొంతం కాగా.. ఉత్తమ నటిగా రుక్మీణీ వసంత్ అందుకున్నారు.

సైమా 2024 అవార్డుల విజేతల్ని చూస్త..

ఉత్తమ నటుడు నాని (దసరా)

ఉత్తమ నటి కీర్తి సురేశ్ (దసరా)

ఉత్తమ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (దసరా)

ఉత్తమ చిత్రం భగవంత్ కేసరి

ఉత్తమ సహాయ నటుడు దీక్షిత్ శెట్టి (దసరా)

ఉత్తమ సహాయ నటి బేబీ ఖియారా ఖాన్ (హాయ్ నాన్న)

ఉత్తమ హాస్య నటుడు విష్ణు (మ్యాడ్)

ఉత్తమ పరిచయ నటుడు సంగీత్ శోభన్ (మ్యాడ్)

ఉత్తమ నూతన నటి వైష్ణవి చైతన్య (బేబీ)

ఉత్తమ సంగీత దర్శకుడు అబ్దుల్ వాహబ్ (హాయ్ నాన్న, ఖుషీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ భువన గౌడ (సలార్)

ఉత్తమ సినీ గేయ రచయత అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా, బేబీ)

ఉత్తమ నేపథ్య గాయకుడు రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు - బలగం)

ఉత్తమ నూతన దర్శకుడు శౌర్యువ్ (హాయ్ నాన్న)

ఉత్తమ నూతన నిర్మాత వైరా ఎంటర్ టైన్ మెంట్స్ (హాయ్ నాన్న)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) ఆనంద్ దేవరకొండ (బేబీ)

ఉత్తమ నటి (క్రిటిక్స్) మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న)

ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) సాయి రాజేశ్ (హాయ్ నాన్న)

సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా