Begin typing your search above and press return to search.

సల్మాన్ 'సికిందర్'.. రష్మిక కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్!

ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా బిజీగా గడుపుతోంది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన సికిందర్ మూవీ ఎలా ఉంది? పబ్లిక్ టాక్ సంగతేంటి?

By:  Tupaki Desk   |   30 March 2025 10:50 AM
సల్మాన్ సికిందర్.. రష్మిక కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్!
X

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సికిందర్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషించారు. రంజాన్ కానుకగా నేడు సినిమా థియేటర్లలోకి వచ్చింది.

అయితే కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం సల్మాన్ వెయిట్ చేస్తుండగా.. రష్మిక ఫుల్ జోష్ లో ఉందనే చెప్పాలి. రీసెంట్ గా పుష్ప 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న అమ్మడు.. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా బిజీగా గడుపుతోంది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన సికిందర్ మూవీ ఎలా ఉంది? పబ్లిక్ టాక్ సంగతేంటి?

నిజానికి సల్మాన్ సినిమా అంటే ఓ రేంజ్ లో ఊహించుకుంటారు అంతా. ఆయన ఇమేజ్ కు తగ్గ కథ సెట్ అయితే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ పక్కా. అదే సమయంలో రష్మిక హీరోయిన్ గా నటించడంతో సికిందర్ మంచి బజ్ నెలకొంది. అటు డైరెక్టర్ మురుగదాస్ కు కూడా క్రేజ్ ఉంది. కాబట్టి సినిమాపై ఆడియన్స్.. భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఇప్పుడు సికిందర్ వాటిని అందుకోలేదని రివ్యూస్ వస్తున్నాయి. ఆడియన్స్ ను నిరాశపరిచిందని అంటున్నారు. సల్మాన్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరగా.. ముఖ్యంగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న రష్మిక జోష్ కు బ్రేక్ పడిందని చెబుతున్నారు. ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అని అభిప్రాయపడుతున్నారు.

అదే సమయంలో సినిమాలో సల్మాన్ రోల్ ఇంట్రెస్టింగ్ లేదని చెబుతున్నారు. భార్య ఆకస్మిక మరణాన్ని ఎదుర్కొంటున్న భర్త పాత్రకు కావలసిన భావోద్వేగం మిస్ అయిందని అంటున్నారు. రష్మిక మాత్రం తన టాలెంట్ తో అదరగొట్టిందని కొనియాడుతున్నారు. కానీ సల్మాన్ తో రష్మిక కెమిస్ట్రీ అసలు సెట్ కాలేదని కామెంట్లు పెడుతున్నారు.

కాజల్ అగర్వాల్, జతిన్ సర్మాన్, ప్రతీక్ బబ్బర్ తమ రోల్స్ కు న్యాయం చేశారని చెబుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించిన పాటలు, సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగోలేదని చెబుతున్నారు. సీన్స్ కు సెట్ కాలేదని అంటున్నారు. NGE ప్రైవేట్ లిమిటెడ్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు మాత్రం బాగానే ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు. కానీ ఓవరాల్ గా మూవీ మాత్రం బాలేదని చెబుతున్నారు.