45 రోజుల షూట్ కోసం 90 రోజుల కష్టం!
కొన్ని సన్నివేశాలైతే కంట కన్నీరే పెట్టించేలా ఉంటాయని అంటున్నారు.
By: Tupaki Desk | 29 Aug 2024 8:30 AM GMTసల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'సికందర్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. మురగదాస్ మార్క్ యూనిక్ పాయింట్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదే సమయంలో కథలో బలమైన ఎమోషన్ సైతం హైలైట్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలైతే కంట కన్నీరే పెట్టించేలా ఉంటాయని అంటున్నారు.
దాంతో పాటు మురగదాస్ మార్క్ సందేశం కూడా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారుట. మూడు నెలలుగా ఈ సెట్ నిర్మాణం లో ఉన్నట్లు సమాచారం. ఈసెట్ లో 45 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ ప్లాన్ చేసారుట. దీన్ని ఓ ప్రత్యేక షెడ్యూల్ గా భావించి షూట్ కి వెళ్తున్నా రుట. దీంతో ఈ సెట్ నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలుస్తోంది. 90 రోజుల పాటు సెట్ నిర్మాణం అంటే చిన్న విషయం కాదు.
ఎంతో మంది కార్మికులు పనిచేస్తే తప్ప పూర్తికాని పరిస్థితి. అలాగే ఇంతవరకూ మురగదాస్ ఇలాంటి భారీ సెట్ లో షూటింగ్ చేసింది లేదు. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ లాంగ్ షెడ్యూల్ మాత్రం చేయలేదు. అవసరం మేర పాటల కోసం సెట్ ని వినియోగించారు. ఆయన మెజార్టీ సన్నివేశాలంటే పబ్లిక్ గానే ఉంటాయి. వీలైనంత వరకూ ఔట్ డోర్ షూటింగ్ కి ప్రాధాన్యత ఇస్తారు.
కానీ `సికందర్` విషయంలో 45 రోజులు సెట్ లోనే షూట్ చేస్తారు అంటే దానికి చాలా ప్రాధాన్యత ఉన్నట్లే. ఇందులో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసే అవకాశం ఉంది. అలాగే కొంత టాకీ పార్టు కూడా ఉంటుంది. ఇందులో సల్మాన్ కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం భారీగా ఉన్నా! రొమాన్స్ కి పెద్దగా ప్రాధాన్యత లేని నేపథ్యంలో హీరోయిన్ పాత్రని బ్యాలెన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.