Begin typing your search above and press return to search.

భాయ్ తో ముర‌గ‌దాస్ సికంద‌ర్!

తాజాగా రంజాన్ సంద‌ర్భంగా ఆ ప్రాజెక్ట్ ష‌రు అయింది. ఏకంగా సినిమా టైటిల్ కూడా ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ చేసారు.

By:  Tupaki Desk   |   11 April 2024 6:48 AM GMT
భాయ్ తో  ముర‌గ‌దాస్ సికంద‌ర్!
X

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్-ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో సినిమా ఎప్పుడోస్తుందా? అని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. 'జైహో' లాంటి భారీ హిట్ ఇచ్చిన త‌ర్వాత ఆ కాంబో మ‌ళ్లీ చేతులు క‌ల‌ప క‌పోవ‌డంతో? ఎప్పుడెప్పుడా? అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. గ‌త రెండేళ్ల‌గా ఈ ప్రచారం పీక్స్ కి చేరింది. రెండు నెల‌ల క్రిమ‌తే ముర‌గదాస్ స‌ల్మాన్ ఖాన్ తో మ‌రో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి అభిమానుల్లో ఎగ్జెట్ మెంట్ రెట్టింపు అయింది. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభ‌ముతుంద‌ని నెట్టింట అడుగుతున్నా? స‌రైన స‌మాధానం రాలేదు.

తాజాగా రంజాన్ సంద‌ర్భంగా ఆ ప్రాజెక్ట్ ష‌రు అయింది. ఏకంగా సినిమా టైటిల్ కూడా ప్ర‌క‌టించి స‌ర్ ప్రైజ్ చేసారు. 'సికంద‌ర్' టైటిల్ తో ఇద్ద‌రు సెట్స్ కి వెళ్ల‌బోతున్నారు. ఇది స‌ల్మాన్ మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్. కానీ తెర‌కెక్కించేది ముర‌గ‌దాస్ కాబ‌ట్టి! స్టోరీ ఎలా ఉంటుంది? అని ఇప్పుడే గెస్ చేయ‌డం క‌ష్టం. ముర‌గ‌దాస్ కంటెంట్ యూనిక్ గా..క్రియేటివ్ గా ఉంటుంది. సందేశాత్మ‌కంగానూ ఉంటుంది. కొంత కాలంగా ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వానికి దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న నుంచి సినిమా రిలీజ్ అయిన నాలుగేళ్లు అవుతుది. 'ద‌ర్బార్' త‌ర్వాత నిర్మాత‌గా రెండు సినిమాలు చేసారు త‌ప్ప ద‌ర్శ‌కుడిగా మాత్రం ఎలాంటి చిత్రం చేయ‌లేదు. తాజాగా స‌ల్మాన్ తో 'సికంద‌ర్' క‌న్ప‌మ్ అవ్వ‌డంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈద్ కి ప్రారంభ‌మైన సినిమా 2025 ఈద్ కి రిలీజ్ చేస్తున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని సాజిద్ నదియాడ్‌వాలా నిర్మిన్నారు. ఈద్ అంటే స‌ల్మాన్ కి ఎంతో ఇష్ట‌మైన పండుగ‌ని అని చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రతీ ఏడాది ఈద్ సంద‌ర్భంగా ఏదో గుడ్ న్యూస్ ఇవ్వ‌డం ఆయ‌న‌కు అల‌వాటు.

2024 కి కొత్త ప్రాజెక్ట్ షురూ చేసి అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చాడు. వ‌చ్చే ఏడాది ఈద్ కి రిలీజ్ తో ప్రేక్ష‌కుల ముందు ఉంటాడు. త్వరలోనే సికందర్ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం సికింద‌ర్ టైటిల్ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.